ఖచ్చితంగాప్రేమలో ఉన్న ప్రతీ ప్రేమికులు 8 విషయాలు తెలుసుకోవాలి ..

loverd

ప్రేయ‌సీ ప్రియుల‌న్నాక అప్పుడ‌ప్పుడు వారి మ‌ధ్య చిన్న‌పాటి రుస రుసలు, మూతి ముడుచుకోవ‌డాలు, అల‌గ‌డాలు, బుజ్జ‌గించ‌డాలు స‌హ‌జ‌మే. అవి అయిపోయాక మళ్లీ తిరిగి ఎప్ప‌టిలాగే క‌లసి ఉంటారు. ఈ క్ర‌మంలో వారు అలా క‌ల‌సి ఉండ‌క‌పోతే ఆ రుస రుసలు కాస్తా వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న సంబంధాన్ని ఇంకొంత దూరం చేస్తాయి. దీంతో ప్రేమికులు ఇద్ద‌రూ, లేదంటే ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు అవ‌త‌లి వారి ప్రేమను, వారిని ప‌ట్టించుకోవ‌డం మానేస్తారు.
అయితే ప్రియుడి సంగ‌తి ఏమో గానీ ఈ విష‌యంలో ప్రేయ‌సి గురించి ప్రియుడు తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉంటాయ‌ట‌. ప్రేయ‌సి త‌న ప్రేమ‌ను, త‌న‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో ప్రియుడు ఈ అంశాల‌ను గ‌మ‌నిస్తే సుల‌భంగా ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ట‌. ఆ అంశాలు ఏమిటంటే…
1. ప్రియుడు ఎప్పుడైనా ప్రేయ‌సితో తాను బిజీగా ఉన్నానని, ఆమెతో మాట్లాడే స‌మ‌యం లేద‌ని చెప్పాడ‌నుకోండి. అప్పుడు ప్రేయ‌సి ప్రియుడి ప్రేమ గురించి ప‌ట్టించుకోవ‌డం మానేస్తుంద‌ట‌. అత‌న్ని నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ట‌.
2. ప్రేయ‌సి మాట్లాడే మాట‌ల‌కు ప్రియుడు బోర్‌గా ఫీలైన‌ట్టు ఆమె ముందు ప్ర‌వ‌ర్తిస్తే చాలు. అప్పుడు కూడా ప్రేయ‌సి అత‌న్ని నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ట‌.
3. ఎప్పుడైనా ప్రియుడు వెయిట్ చెయ్య‌మ‌ని చెప్పి రాక‌పోయినా, లేదంటే స‌రైన టైముకు రాక‌పోయినా ప్రేయ‌సి అత‌ని ప్రేమ‌ను ప‌ట్టించుకోద‌ట‌.

4. ప్రేయ‌సి ముందు ఆమె గురించి కాక ఇంకా వేరే యువ‌తి గురించి ప్రియుడు మాట్లాడితే అప్పుడు కూడా ప్రేయ‌సి ప్రియున్ని ప‌ట్టించుకోద‌ట‌.
5. ప్రేయ‌సి ఇచ్చే మెసేజ్‌ల‌కు ప్రియుడు రిప్లై ఇవ్వ‌క‌పోతే అత‌ని ప్రేమ‌ను ఆమె ప‌ట్టించుకోద‌ట‌. అత‌న్ని పూర్తిగా ప‌క్క‌కు పెట్టేస్తుంద‌ట‌.
6. ప్రేయ‌సీ ప్రియులు ఇద్ద‌రూ సంభాషించుకునేట‌ప్పుడు ఇద్ద‌రూ ఒకేసారి ఆ సంభాష‌ణ‌కు ముగింపు ప‌ల‌కకుండా కేవ‌లం ప్రియుడు మాత్ర‌మే సంభాష‌ణ‌ను ముగించేలా మాట్లాడితే అప్పుడు కూడా ప్రేయ‌సి ప్రియున్ని ప‌ట్టించుకోద‌ట‌. అత‌ని ప్రేమ‌ను కాదంటుంద‌ట‌.
7. ప్రియుడు ప్రేయ‌సికి అబద్దాలు చెప్పినా ఆమె స‌హించ‌లేద‌ట‌. ఆమెకు న‌చ్చ‌ద‌ట‌. ఆ సంద‌ర్భంలోనూ అత‌న్ని దూరంగా పెడుతుంద‌ట‌.
8. ప్రేయ‌సి క‌న్నా ప్రియుడు ఇంకా వేరే ఎవ‌రికో అధికంగా ప్రాధాన్య‌త‌ను ఇస్తుండ‌డాన్ని కూడా ఆమె స‌హించ‌లేద‌ట‌. ఇందువ‌ల్ల కూడా ప్రేయ‌సి ప్రియుడి ప్రేమ‌ను అంగీక‌రించ‌ద‌ట‌.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *