కొడుకు కోసం మహేష్‌ ట్వీటిన

 

meh

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు ట్విట్టర్‌లో అకౌంట్‌ ఉంది. అయితే కొన్ని సార్లు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కూడా ఆ విషయాన్ని మర్చి పోతారు. ఎందుకంటే ఆయన ట్విట్టర్‌లో చాలా అరుదుగా ట్వీట్చ్‌ చేస్తూ ఉంటాడు. తన సినిమా రిలీజ్‌ సమయంకు లేదా ఏదైనా ముఖ్యమైన సంఘటనకు మాత్రమే ఆయన ట్వీట్స్‌ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్‌బాబు తనకు వరుసకు కొడుకు అయ్యే నవీన్‌ కృష్ణ కోసం ట్వీట్‌ చేశాడు.
విజయనిర్మల మనవడు అయిన నవీన్‌ కృష్ణ తాజాగా ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ అనే చిత్రంలో నటించాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్‌ కృష్ణ సినిమా బాగుందని, అతడి నటన ఆకట్టుకునేలా ఉంది అంటూ సినిమాపై అంచనాలు పెరిగేలా మహేష్‌బాబు ట్వీట్‌ చేశాడు. మహేష్‌బాబు ట్వీట్‌తో సినిమాపై జనాల దృష్టి పడటం జరిగింది. అయితే ఆ సినిమా విడుదలై రెండు రోజులు అయ్యింది. ఇప్పటికే ఆ సినిమాపై బ్యాడ్‌ టాక్‌ విస్తరించింది. ఈ సమయంలో మహేష్‌బాబు ట్వీట్‌ వల్ల ఒరిగేది ఏమైనా ఉందా అనేది చూడాలి.

Comments

comments

You may also like...