కాటమరాయుడు జల్సాసెంటిమెంట్‌తో

kata

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. డాలీ దర్శకత్వంలో ఈ సినిమాను శరత్‌ మారార్‌ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ కొత్తగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వైవిధ్యభరిత కథాంశంతో ఈ సినిమాను డాలీ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదలకు డేట్‌ కూడా ఫిక్స్‌ అయ్యింది.

‘కాటమరాయుడు’ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో పవన్‌ నటించిన ‘జల్సా’ మరియు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రాలు ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాల్లో ‘జల్సా’ సూపర్‌ హిట్‌ అవ్వగా, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సెంటిమెంట్‌తో ‘కాటమరాయుడు’ వస్తుందో అనేది చూడాలి. పవన్‌ కెరీర్‌లో జల్సా చాలా ముఖ్యమైన సక్సెస్‌. అందుకే జల్సా సెంటిమెంట్‌తో కాటమరాయుడు తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా ముద్దుగుమ్మ శృతిహాసన్‌ నటిస్తోంది. పవన్‌ ఈ సినిమా పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలను కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి నేసన్‌ దర్శకత్వంలో కాగా మరోటి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *