కలెక్షన్స్‌పై రానా కామెంట్స్‌ : ‘బాహుబలి 2’

b-raan

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. మరో నెల రెండు నెలల్లో షూటింగ్‌ పూర్తిగా అయిపోనుంది. దాంతో సినిమా కలెక్షన్స్‌ మరియు రికార్డులపై ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు దృష్టి సారించారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ చిత్రం దాదాపు 650 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా సంచలనాన్ని సృష్టించింది. ఇక రెండవ పార్ట్‌ వెయ్యి కోట్లు ఖచ్చితంగా సాధిస్తుందనే నమ్మకంతో ప్రభాస్‌ మరియు రాజమౌళి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక రెండవ పార్ట్‌ కలెక్షన్స్‌పై తాజాగా రానా స్పందించాడు.
‘బాహుబలి’ సినిమాలో విలన్‌ పాత్రలో నటించిన రానా తాజాగా ముంబయిలో జరిగిన సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొనలేదు. అందుకే తాజాగా రానా ఈ సినిమాపై స్పందిస్తూ కలెక్షన్స్‌ గురించి మాట్లాడాడు. 600 కోట్లకు పైగా ఈ సినిమా కూడా సాధిస్తుందనే నమ్మకంతో రానా ఉన్నాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా 600 కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా ప్రమోషన్‌ను చేయాలని భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ సినిమా 800 కోట్ల నుండి 1000 కోట్ల వరకు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో ఏప్రిల్‌ చివర్లో ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెల్సిందే.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *