ఏమైంది పివి సింధు కు ….

జపాన్ ఓపెన్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, రాష్ట్ర క్రీడాకారిణి పీవీ సింధు పోరు ముగిసింది. ఒలింపిక్స్‌ తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలోనే సింధుకు ఎదురుదెబ్బ తగిలింది. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో నిరుడు రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం ఉత్కంఠభరిత పోరులో ఆరో సీడ్‌ సింధు 13-21, 23-21, 18-21తో సయాక శాటో (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.

ఒక గంటా 5 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి సొంతంగా సాధించిన పాయింట్ల కంటే సింధు అనవసర తప్పిదాలే అధికం. తొలి గేమ్‌లో శాటో అద్భుతంగా ఆడకపోయినా.. ఆమె సంధించిన సాధారణ స్ట్రోక్‌లకు సమాధానమివ్వడంలో సింధు విఫలమైంది. దీంతో 12-8తో ఆధిక్యంలో ఉన్న సింధు చూస్తుండగానే గేమ్‌పై పట్టు కోల్పోయింది.

Comments

comments

You may also like...