ఏమి చేస్తే మరణించాక స్వర్గానికి వెళ్ళ వచ్చు ..!!

హిందూ సాంప్రదాయంలో భక్తులకు తెలియని ఆచార వ్యవహారాలు, పద్ధతులు, సంస్కారాలు చాలానే ఉన్నాయి. చాలా మటుకు శాస్త్రం ప్రకారం చేసే కార్యక్రమాల్లో ప్రతి దాని వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. దీని గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఏ కార్యక్రమాన్ని, పూజను ఎందుకోసం చేస్తామో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అలాంటి వాటిలో హిందువులు నిర్వహించే శ్రాద్ధ కర్మల క్రియ కూడా ఒకటి. ఇంతకీ ఈ కర్మలను ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..? మహాభారతంలో శ్రాద్ధ కర్మల గురించి వివరంగా ఉన్నట్టు పలువురు పండితులు చెబుతున్నారు. ప్రధానంగా 3 రకాల రుణాలను తీర్చుకోవడం కోసం చనిపోయిన వారికి ఈ శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారట.

మొదటిది దేవ రుణం…

మనిషి తాను జీవించి ఉన్నంత కాలం దాన ధర్మాలు చేస్తే ఈ రుణం తీర్చుకున్నట్టు అవుతుందట. అలా చేయలేని వారు ఒక వేళ చనిపోతే వారి కుటుంబ సభ్యులెవరైనా శ్రాద్ధ కర్మలు చేస్తే అప్పుడు ఆ రుణం తీర్చుకున్నట్టై వారికి మంచి లోకాలు కలుగుతాయట.
రెండో రుణం రుషి రుణం…
మనిషి బతికి ఉన్నప్పుడు తాను సంపాదించే జ్ఞానాన్ని ఇతరులకు పంచితే ఈ రుణం తీర్చుకున్నట్టు అవుతుందట. ఇక పైన చెప్పినట్టుగా ఒక వేళ ఎవరైనా ఇలా కూడా చేయలేకపోతే వారు చనిపోయాక వారి కుటుంబ సభ్యులు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అప్పుడు ఈ రుషి రుణం కూడా తీరినట్టు అవుతుంది. ( ఈ రెండు రుణాలు.బతికున్నప్పుడే తీర్చుకుంటే ఆ వ్యక్తి స్వర్గానికి వెళతాడని పురాణాలు చెబుతున్నాయి.)
మూడవది పితృ రుణం…
ఈ రుణం తీరాలంటే మాత్రం చనిపోయిన వారికి కచ్చితంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించి తర్పణాలు, పిండ ప్రదానాలు చేయాల్సిందేనట. అప్పుడే 3 రుణాలు తీరినట్టయి చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందట. భూమిపై నివసించే వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుందట. అందుకే ఎవరైనా తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించకుండా చనిపోతే, వారి పేరిట ఇప్పుడున్నవారు తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను నిర్వహించాలట. అలా చేసినా చనిపోయిన వారి ఆత్మలు శాంతించి, ఇప్పుడున్న వారికీ మంచి జరుగుతుందట. కాబట్టి పైన చెప్పిన 3 రుణాల్లోనూ పితృ రుణం తీర్చుకునే దిశగా ఎవరైతే చనిపోయిన తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుందట. అయితే అలాంటి కర్మలు నిర్వహించే స్థోమత లేని వారు మహాలయ పక్ష చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు తమ సమీపంలో ఉన్న ఏదైనా ఒక పెద్ద చెట్టు వద్దకు వెళ్లి దాన్ని ఆలింగనం చేసుకుని చనిపోయిన తమ పూర్వీకులను తలచుకుని కన్నీరైనా కార్చాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయడం వల్ల కూడా శ్రాద్ధ కర్మలు చేసినంత ఫలితం కలుగుతుందట.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *