ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ రూ 259 కే 10 జిబి డాటా

రిలయన్స్ జియో ఉచిత ప్రకటన తరువాత దానికి పోటీగా మిగతా కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేసపెడుతూ వినియోగదారులను తమ వైపు ఆకర్షించుకునేలా చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సరికొత్త డాటా ప్లాన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా కొత్తగా 4జి మొబైల్‌ కొనుగోలు చేసే కస్టమర్లు 259 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 10జిబి.. 4జి/3జి డేటాను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

259 రూపాయలతో రీచార్జ్‌ చేసుకోగానే 1జిబి డేటా వెంటనే కస్టమర్‌ ఖాతాలో క్రెడిట్‌ అవుతుందని, మిగతా 9 జిబిల డేటాను మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఈ డేటా కాలపరిమితి 28 రోజులు. ఈ ఆఫర్‌ కింద 90 రోజుల్లో గరిష్ఠంగా మూడుసార్లు రీచార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. డేటాను అధికంగా వినియోగించే కస్టమర్లకు ఈ ఆఫర్‌ ఉపయోగపడుతుందని తెలిపింది.

Comments

comments

You may also like...