ఎద్దు వీర్యం షాంపూలో .. బొద్దింకల పొడిని లిప్ స్టిక్ లో… ఎందులో ఏం కలుపుతారో తెలిస్తే ..!!

షాంపూలో ఎద్దు వీర్యం, లిప్ స్టిక్ లలో దంచిన బొద్దింకల పొడి.. సౌందర్యలేపనాల్లో మనకు జుగుప్స కలిగించే పదార్థాలను కలుపుతారని మీకు తెలుసా..? ఎనర్జీ డ్రింక్ లలో సైతం ఇలా అనేక రకాల పదార్థాలను కలపటం రివాజుగా మారింది. అయితే వేటిలో ఏం కలుపుతారో ఒకప్పుడు బయటకు తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక రోజుకోక కొత్త విషయం బయటకు వస్తోంది. అలానే ఇదీ. ఆధునిక కాలంలో మనం ఉపయోగించే సౌదర్యలేపనాల్లో కలిపే పదార్థాలు ఏంటో తెలుసుకోండి…

* వినడానికి ఏదోలా ఉన్నా.. ఎద్దు వీర్యంను కొన్ని ప్రోటీన్లు, విటమిన్లలో ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఎనర్జీ డ్రింక్ లలో వీటిని ఉపయోగిస్తుంటే తాజాగా కొన్ని రకాల షాంపుల్లోనూ వీటిని కలుపుతున్నారట.
* వేల్ లాలాజలం.. సముద్రాల్లో జీవించే ఈ వేల్ లాలాజలం పెర్ఫ్యూంలలో ఉపయోగిస్తారు.
* చితకొట్టిన బీటిల్స్(చిన్న సైజ్ బొద్దింకలు).. మహిళలు అధికంగా వాడే లిప్ స్టిక్ లలో చనిపోయిన బీటిల్స్ నుంచి వచ్చే ఎర్రని రసాన్ని లిప్ స్టిక్ లలో వాడతారు. వీటితోపాటు కొన్ని కాఫీ పొడులలోనూ ఈ బీటిల్స్ పదార్థాన్ని వాడతారు.
* షార్క్ కాలెయం నూనె.. సొరచేపల కాలెయం నుంచి వెలువడే గుజ్జును నూనెగా చేసి మాయిశ్చరైజర్స్(కోల్డ్ క్రీమ్, ఆయిల్స్) లలో ఉపయోగిస్తారు. క్యాన్సర్ ను నిరోధించడానికి షార్క్ లివర్ ఆయిల్ ను వాడతారు.
* నత్త ఒక చోటు నుంచి మరోచోటుకు పాకుతున్నప్పుడు కొంచెం జిగటలాంటి పదార్థం బయటకు వస్తుంది. ఈ జిగట పదార్థాన్ని అందంగా మెరవటానికి ఉపయోగించే ఫేస్ క్రీమ్ లలో వాడుతున్నారు.
* డైనమెట్ లో డైటోమాసియస్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఈ పదార్థాన్ని పగలగొట్టి పొడిగా చేసి టూత్ పేస్టులలో ఉపయోగిస్తున్నారు. ఇక కాస్మటిక్ లలో నైట్రోగ్లిజరిన్ గా వాడుతున్నారు.
* పెయింటింగ్ లలో మరింత ఆకర్షణగా ఉండటానికి సీసంను ఉపయోగిస్తారు. అలాగే ముఖానికి రంగులు వేసుకొనేందుకు ఈ సీసంను వాడతారు.
* 1950 లలో యూరియాను ఫెయిర్ నెస్ క్రీమ్ గా ఉపయోగించే వారు. యూరియాలో ఉండే యురైన్ రసాయనం వల్ల ముఖం మరింత గ్లో సంతరించుకుంటుందట.
* ఎలాంటి చిన్న గాయాలైనా, చిన్న మొటిమలు వంటివి ఉన్నా సరే పక్షిరెట్టను ముఖానికి రాయటం వల్ల అందంగా కనిపిస్తారు. హాలివుడ్ తారలు విక్టోరియా బెక్ హం, టాం క్రూజ్ పక్షి రెట్టలను తమ శరీరానికి అప్లై చేస్తారట.
* మురికి, స్టోరేజ్ అయిన నీళ్లలో ఉండే నాచును సౌందర్యం కోసం శరీరానికి అప్లై చేయటంతోపాటు, పౌష్టికాహారం పేరుతో ఆ పదార్థాన్ని తీసుకుంటారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *