టాక్సీన్స్ మరియు అధిక కొవ్వుని, విష పదార్థాలని 3 రోజులలోనే శరీరంలో తగ్గించుకోవచ్చు..!

అధిక బరువుతో అనారోగ్యం, అసౌకర్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే వస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, బాడీ విష వ్యర్థాలతో నిండిపోవడమే ఈ అధిక బరువుకు కారణం.. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండింటి విషయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే గుండె జబ్బులు, డయాబెటిస్, బిపి లాంటి ఆనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొట్ట దగ్గరే ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు అలా పేరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జంక్‌ఫుడ్‌, కార్బొహైడ్రేట్లు, చ‌క్కెర‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తిన‌డ‌మే. దీంతో శ‌రీరంలో విష ప‌దార్థాలు కూడా పేరుకుపోతాయి. కింద చెప్పిన విధంగా చేస్తే బాడీలో పేరుకుపోయిన కొవ్వుని, విష పదార్థాలని 3రోజుల్లో తగ్గించుకోవచ్చు..!

కొవ్వుని, విష పదార్థాలను తగ్గించుకునేందుకు ఇలా చేయాలి
* అధికంగా కొవ్వు, విష పదార్థాలు పేరుకోపోవడానికి ముఖ్య కారణం చక్కెరతో తయారుచేసిన పదార్థాలని ఎక్కువగా తినడమే. చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలని దూరం పెట్టాలి. పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే అన్నం వంటి ఆహార ప‌దార్థాల‌ను, జంక్ ఫుడ్‌ను అస్స‌లు తీసుకోవ‌ద్దు. 3 రోజుల పాటు కింద చెప్పిన విధంగా ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి.
* ఉద‌యం ఓట్స్‌తో బాదం ప‌ప్పు లేదా బెర్రీలు, స్క్రాంబుల్డ్ ఎగ్స్‌ తీసుకోవాలి. 2, 3 గుడ్లను ప‌గ‌ల‌గొట్టి అందులో పాలు, ఉప్పు, మిరియాల పొడి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌డాయ్‌లో వేసి వేడి చేయాలి. దీంతో స్క్రాంబుల్డ్ ఎగ్స్ త‌యారైపోతుంది.
* ఉద‌యం అల్పాహారం త‌రువాత మ‌ధ్యాహ్నం భోజ‌నానికి ముందు ఒక క‌ప్పు న‌ట్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవాలి.
* మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఉడికించిన ఎర్ర ముల్లంగి దుంప (తుర్నిప్స్‌), క్యారెట్స్‌, బీట్‌రూట్‌, బీన్స్‌, బాదం ప‌ప్పు, చికెన్ బ్రెస్ట్‌ వంటి వాటిని తీసుకోవాలి.
* రాత్రి భోజ‌నంలో చేప‌ల‌తో బీన్స్‌, పుట్ట గొడుగులు, బ్ర‌కోలి వంటి వాటిని తినాలి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *