అదృష్టానికి తిరుగే లేదు ఈమొక్కలు ఇంట్లో ఉంటే ..!

మొక్కలు పెంచడం చాలా మంచి అలవాటు. మొక్కలతో పచ్చదనంతో పాటుగా అదృష్టం కూడా వరిస్తుందని చాలా మంది నమ్మకం. నమ్మకాలు కలిగిన వారు అదృష్టాన్ని పొందేందుకు ఏయే మొక్కలు తప్పనిసరిగా పెంచాలో చూద్దాం…

తులసి మొక్క
అమ్మవారికి ప్రతిరూపమైన తులసి చాలా పవిత్రమైంది. తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అలా ఉంటే అదృష్టం, ఆరోగ్యం రెండూ ప్రాప్తిస్తాయి.
ఉసిరి మొక్క
ఉసిరి మొక్కను సాక్షాత్తూ విష్ణు మూర్తిగా భావిస్తారు. అందుకే ఉసిరిని ఖచ్చితంగా ఇంట్లో ఉంచాలి. కార్తీక మాసంలో ఉసిరి, తులసిని కలిపి పూజ చేయడం కూడా తెలిసిందే..
కలబంద
దిష్టి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉంటే మనకు మంచే జరుగుతుంది. వచ్చే దిష్టి దోషాలన్నీ పోతాయి.
మనీ ప్లాంట్
పేరులోనే డబ్బు ఉన్న ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే ధనం పుష్కలంగా సమకూరుతుంది. డబ్బే కాకుండా ఈ మొక్క కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే రోజూ దానికి కొద్దిగా నీళ్లు పోయాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితం వస్తుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *