ఈ తప్పులు చేయకుండా ఉంటె చాలు తల స్నానం చేసేటప్పుడు జుట్టు ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది .

కేశ సంపద అందంగా ఉండాలంటే నిరంతరం మెరుగులు దిద్దక తప్పదు. నిగనిగలాడే కురులు మనకు దూరమవడానికి కారణం మనం చేసే తప్పులే. సొగసైన జుట్టు కోసం మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటో మీకు తెలుసా?
సరైన షాంపూను ఎంచుకోలేకపోవడం
అన్ని షాంపూలు ఒకటే అనుకుంటాం. కానీ వాటిలో తేడాలు ఉంటాయి. అందుకే జుట్టు స్వభావానికి తగిన షాంపూను ఎంచుకోవాలి. డల్‌‌గా ఉండే హెయిర్ ఉన్నవాళ్ళు షాంపూలో సహజసిద్ధమై పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
మితిమీరిన రసాయన పదార్థాలు ఉన్న షాంపూను వాడటం
ఘాటుగా, రసాయనాలు నిండిన షాంపూ వల్ల జుట్టు పొడిబారిపోయి పాడవుతుంది. డిటర్జెంట్లు కలిసిన షాంపూ వల్ల వెంట్రుకలు పెళుసుబారిపోతాయి.
పదే పదే రుద్దడం వల్ల వెంట్రుకలు బలహీనపడతాయి
వెంట్రుకలు నిగారింపుగా ఎదగాలంటే సహజసిద్ధమైన నూనెలను వాడాలి. జుట్టును అనేకసార్లు రుద్దితే బలహీనంగా మారిపోతుంది. దీనివల్ల కుదుళ్ళు దెబ్బతింటాయి.
వెంట్రుకలను క్రింది నుంచి పై దాకా రుద్దనక్కర్లేదు
నెత్తి మీద చర్మాన్నే షాంపూతో రుద్దాలి. వెంట్రుకలను రుద్దకూడదు. నెత్తి మీద చర్మాన్ని రుద్దిన తర్వాత వెంట్రుకలను జాడిస్తే చాలు.

షాంపూ పెట్టిన ప్రతిసారీ కండిషనింగ్ చేయకపోవడం
వీకెండ్ వాష్‌ టైమ్‌లోనే కండిషనర్లను వాడాలని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇది పొరపాటు. షాంపూతో రుద్దుకున్న ప్రతిసారీ కండిషనర్లును ఉపయోగించవలసిందే. దీనివల్ల తేమ పోతుంది. జుట్టు మృదువుగా ఉంటుంది. షాంపూ పెట్టిన తర్వాత కండిషనర్‌ను పెట్టకపోతే వాతావరణం వల్ల జరిగే నష్టాలకు గురి కావాల్సిందే. అయితే కండిషనర్‌ను నెత్తి మీద చర్మం కోసం వాడకూడదు. కేవలం వెంట్రుకలకు మాత్రమే వాడాలి. నెత్తి మీద చర్మంపై కండిషనర్ పెడితే చుండ్రు, జిడ్డు వెంట్రుకలు వస్తాయి.
అందంగా మెరిసే సొగసైన కురుల కోసం ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలిసింది కదా! ఈ జాగ్రత్తలు పాటించండి… ఒత్తైన జుత్తుతో ఆనందించండి!

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *