ఈ డ్రింక్ రాత్రి పడుకునే ముందు తాగితే ఎసిడిటీ మరియు జీర్ణ సమస్యలు దూరం ….

as

రాత్రి నిద్రకు ముందు తీసుకునే ఆహారమైనా, పానీయాలైనా.. ఆచి తూచి తీసుకోవాలి. ఎందుకంటే.. రాత్రి పూట నిద్రకు భంగం కలుగకుండా ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు కంటి నిండా నిద్రపడుతుంది. జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. చాలామంది స్టమక్ అప్ సెట్ తో రాత్రిళ్లు నిద్రపోకుండా బాధపడుతుంటారు. అలాంటప్పుడు డైజెషన్ మాత్రమే కాదు..కడుపులో సమస్య, హార్ట్ బర్న్ వంటి లక్షణాలు ఇబ్బందిపెడతాయి.
సింపుల్ గా ఇంట్లో ఉండే పదార్థాలతో తయారుచేసుకునే డ్రింక్.. మీ నిద్రకు ఎలాంటి భంగం కలుగకుండా.. చూస్తుంది. అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల జీర్ణక్రియతో పాటు, రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రి నిద్రకు ముందు తీసుకోవాల్సిన స్పెషల్ హెల్తీ డ్రింక్ ఏంటో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు

2 కప్పుల కొబ్బరిపాలు,
1 టీస్పూన్ పసుపు,
ఒక ఇంచు అల్లం,
పావు టీ స్పూన్ నల్ల మిరియాలు,
1 టేబుల్ స్పూన్ తేనె.
డ్రింక్ తయారు చేసే విధానం :-
నల్ల మిరియాలు, అల్లం, పసుపు, కొబ్బరిపాలను ఒక కప్పులో కలపాలి. అన్నింటినీ మిక్స్ చేశాక.. తక్కువ మంటపై పెట్టాలి. 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత తేనె కలుపుకుని తాగాలి. అంతే..
ప్రయోజనాలు :-
సింపుల్ గా తయారు చేసే ఈ హెల్తీ డ్రింక్.. కడుపులో సమస్యలు నివారించి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *