ఆ తప్పు మళ్లీ చేయనంటున్న జక్కన్న

raj

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తప్పు చేయడం ఏంటా అని భావిస్తున్నారా.. అవును ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘బాహుబలి’ సినిమా మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ను తెరకెక్కించే పనిలో దర్శకుడు జక్కన్న ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబయి ఫిల్మ్‌ పెస్టివల్‌లో జక్కన్న పాల్గొన్న విషయం తెల్సిందే. అక్కడ మీడియాతో జక్కన్న మాట్లాడాడు. ఆ సందర్బంగానే ఫస్ట్‌పార్ట్‌లో మాదిరిగా సెకండ్‌ పార్ట్‌లో కూడా మీరు కనిపిస్తారా అని ప్రశ్నించారు. అందుకు వింత సమాధానంను జక్కన్న చెప్పుకొచ్చాడు.
సెకండ్‌ పార్ట్‌లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ గురించి జక్కన్న మాట్లాడుతూ.. ఫస్ట్‌ పార్ట్‌లో నటించే చాలా పెద్ద తప్పు చేశాను. అందులో ఎందుకు నటించానా అని ఇప్పటికి కూడా నేను అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో మళ్లీ నేను సెకండ్‌ పార్ట్‌లో కనిపించి తప్పు చేయను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ చివరి దశ షూటింగ్‌ జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. తన సినిమాలో తాను గెస్ట్‌గా నటించడాన్ని ఎందుకు జక్కన్న పెద్ద తప్పుగా భావిస్తున్నాడు అనే విషయం అర్థం కాని విషయం.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *