అరటిపండు రోజుకు ఒకటి తింటే 8 సమస్యలు ఉండవు..!

అందరూ తీసుకునే ఫ్రూట్ బనానా.. ఆకలిని తగ్గించుకోడానికి ఈ పండు తింటారని ఇటీవలి కాలంలో ఫేమస్ అయింది కూడా. ఇది ఏడాదంతా అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. అయితే చాలామందికి అరటిపండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలియదు. అందుకే ఈ పండుని లైట్ తీసుకుంటారు. ఇందులో అద్భుతమైన పోషకాలు మిలితమై ఉంటాయి. సాధారణంగా రోజుకి ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటారు. కానీ రోజుకి ఒక అరటిపండు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ప్రతిరోజూ రెండు అరటిపండు తింటే పొందే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గాలనుకునేవారు బనానా డైట్ ఫాలో అవ్వాలి
అరటిపండులో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఉంటాయి. ఇది ఫ్యాట్, కొలెస్ట్రాల్ లేని ఫ్రూట్. కాబట్టే అరటిపండ్లను డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలని సూచిస్తారు. దీన్ని డైరెక్ట్ గా తినొచ్చు. సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవొచ్చు. అయితే మక్కిన మచ్చలతో ఉండే అరటిపండు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. మచ్చలుండే అరటిపండులో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను అరికడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తినడానికి ప్రయత్నించండి.
హార్ట్ బర్న్
మీరు కంటిన్యూగా హార్ట్ బర్న్ సమస్య, యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడుతున్నారంటే అరటిపండ్లు తింటే వెంటనే ఉపశమనం పొందొచ్చు.
కాన్ట్సిపేషన్
కంటిన్యూగా కాన్ట్సిపేషన్ సమస్యను ఫేస్ చేస్తున్నారంటే ప్రతిరోజూ ఒక నెలపాటు అరటిపండు తింటే సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బోవెల్ మూవ్ మెంట్ ని తేలిక చేస్తుంది.
ఎనర్జీ పొందడానికి
విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అరటిపండ్లు స్టామినా, ఎనర్జీని రోజంతా అందిస్తాయి.
బ్లడ్ ప్రెజర్
అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.
జీర్ణక్రియకు
అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను క్రియాశీలం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే ఎలాంటి జీర్ణసంబంధ సమస్యలు దరిచేరవు.
అనీమియా
అరటిపండ్లను ప్రతిరోజూ తినడం వల్ల అనీమియా (రక్త హీనత) నివారించొచ్చు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ పెరగడానికి, శరీరానికి బ్లడ్ సరఫరా మెరుగుపడడానికి సహాయపడుతుంది.
పొట్టలో అల్సర్
అరటిపండ్లు గ్యాస్ట్రిక్ జ్యూస్ లు తొలగించి ఎసిడిటీని నివారిస్తాయి. పొట్టలో అనారోగ్యాన్ని, ఇరిటేషన్ ని తగ్గించడంలో, బ్యాక్టీరియాతో పోరాడటంలో అరటిపండ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీనివల్ల అల్సర్ నివారించవచ్చు.
ఆరోగ్యకరమైన కళ్లు
అరటిపండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ అరటిపండ్లు తింటే కంటిచూపు సమస్యలు రావు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *