ఎటువంటి కిళ్ళ నొప్పులనైన తగ్గించే అద్భుత ఔషధం.. !

కీళ్లు, ఎముకల నొప్పులు ఒకసారి వచ్చాయంటే కనీసం అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వీటి బాధను భరించలేక ట్రీట్మెంట్లకు లక్షల్లో సైతం ఖర్చు చేస్తున్నారు.. అంతటి నొప్పి, బాధను కలిగిస్తాయి రుమటాయిడ్‌, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులు. ఇవి రెండూ కీళ్లు, ఎముకలకు సంబంధించిన నొప్పులే అయినా దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే కింద ఇచ్చిన రెండు పవర్ ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్‌లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా చేస్తే ఎలాంటి ఆర్థరైటిస్ నొప్పులైనా తగ్గిపోతాయి.

పద్ధతి-1:
ఒక టీస్పూన్ మెంతులను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. * దీంతో ఎలాంటి కీళ్ల నొప్పి అయినా ఇట్టే నయం అవుతుంది. ఈ విధానాన్ని కనీసం 3 నెలల వరకు పాటించాలి. నొప్పి ఎర్లీ స్టేజ్ లో ఉన్నవారయితే 30 నుంచి 40 రోజుల్లోనే చెప్పుకోదగిన ఫలితం లభిస్తుంది.
పద్ధతి-2:
సువాసన వెదజల్లే తెల్లని పారిజాత మొక్క, పూలు అందరికీ సుపరిచితమే.. దేవాలయాల్లో ఎక్కువగా ఈ మొక్కలు ఉంటాయి.
* వీటి ఆకులు 10 వరకు తీసుకుని సంఖ్యలో తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగం అయ్యే వరకు కషాయం కాచుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లగా ఉండగా తాగేయాలి.
* పైన చెప్పిన పారిజాత ఆకుల కషాయం రుమటాయిడ్‌, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులకు ఎంతో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
* దీన్ని నిత్యం ఏ రోజు కారోజు తయారుచేసుకుని తీసుకుంటే కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే ఎలాంటి కీళ్లనొప్పులైనా దూరమవుతాయి.
* ఎముకల్లో అరిగిపోయిన కార్టిలేజ్ గుజ్జు తిరిగి ఉత్పత్తి అవుతుంది.
* అంతేకాదు ఈ ఔషధం డెంగీ జ్వరానికి కూడా బాగా పనిచేస్తుంది. డెంగీతో వచ్చే ఒళ్లు నొప్పులు తగ్గుముఖం పట్టాలంటే ఈ ఔషధాన్ని తాగాలి.
* పైన సూచించిన రెండు పద్ధతుల్లో దేన్నో ఒకదాన్ని మాత్రమే ప్రయత్నించాలి. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *