Why did Iran Attack Pakistan now?

ఓవైపు భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడినట్టు ప్రకటించిన వేళ.. అదే సమయంలో పాక్ సరిహద్దులో ఇరాన్ ఎందుకు దాడిచేసింది?.. ఇప్పుడు ఇదే ప్రశ్న పాకిస్థాన్‌ను తొలిచేస్తోంది. పాకిస్థాన్ సరిహద్దులోని ఇరాన్ బోర్డర్ గార్డులు మోర్టార్ షెల్స్‌తో పంజాగుర్ నగరంపై దాడులకు దిగారు. మూడు షెల్స్‌ ప్రయోగించారు. ఈ దాడిలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఇరాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన విషయాన్ని పాక్ అధికారులు ఇరాన్‌కు తెలియజేశారు. అయితే ఓవైపు ముందునుంచి భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడిన సమయంలోనే వెనక నుంచి అదే సమయంలో ఇరాన్ మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడడానికి గల కారణమేంటో తెలియక పాక్ అధికారులు జట్టు పీక్కింటున్నారు.
నిజానికి పాకిస్థాన్.. ఇరాన్ సహా మరో రెండు దేశాలతో 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు 2014లో ఇరాన్, పాక్‌లు ఒప్పందం చేసుకున్నాయి. పాకిస్థాన్ టెర్రరిస్టులుగా భావిస్తున్నవారు నిజానికి బలూచిస్థాన్ రెబల్స్. పాకిస్థాన్, ఇరాన్ సరిహద్దులో ఇరాన్‌ను ఆనుకుని బలూచిస్థాన్ ఉంది. ఇరాన్ నైరుతి ప్రాంతంలో ఉన్న సిస్తాన్‌.. బలూచిస్థాన్‌దేనని బలూచీల వాదన. సున్నీ ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతాన్ని తిరిగి బలూచిస్థాన్‌లో కలపాలన్న డిమాండ్ ఉంది. దీనిని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. మరోవైపు బలూచిస్థాన్‌లో నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్న పాకిస్థాన్.. ఇదే అంశాన్ని ఉపయోగించుకుని ఇరాన్‌తో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పొరుగుదేశంతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వేళ ఇరాన్ తమపై ఎందుకు దాడికి దిగిందో తెలియని పాక్.. అందుకు గల కారణాలు అన్వేషించే పనిలో పడింది.
erak

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *