What happens to Pakistan if India Opts for Nuclear War?

భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన నేపథ్యంలో పాక్‌ ఎలా స్పందిస్తుంది?భారతపై యుద్ధానికి దిగుతుందా? ఆ యుద్ధం అణు దాడికి దారి తీస్తుందా? అని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే 2002లో భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ఎస్‌.పద్మనాభన్‌ గతంలో ఈ ప్రశ్నలకు చాలా సూటిగా, తీవ్రంగా సమాధానం ఇచ్చారు. 2001 డిసెంబర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా భారత ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ను చేపట్టింది. లక్షల సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా పాక్‌ సరిహద్దులో మోహరించింది. భారత ఏ క్షణమైనా యుద్ధానికి దిగవచ్చనే ఉద్దేశంతో పాక్‌ కూడా తన సైన్యాన్ని ఎదురుగా మోహరించింది. ఆ సందర్భంలో 2002 జనవరి 11న భారత ఆర్మీ చీఫ్‌ పద్మనాభన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘భారత యుద్ధం ప్రారంభిస్తే పాక్‌ భారతపై అణు దాడి చేస్తుందా? చేస్తే ఎలా ఎదుర్కొంటారు?’’ అని కొందరు విలేకరులు ఆయనను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆయన సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. ‘‘భారతపై అణు దాడి చేయడమనేది పాక్‌ ఒక్కటీ తీసుకోగల నిర్ణయం కాదు. అది అంతర్జాతీయ నిర్ణయం. ఎందుకంటే దక్షిణాసియాలో అణ్వస్త్ర దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా అతలాకుతలమవుతుంది. ఇవన్నీ తెలిసి కూడా పాకిస్థానీ నాయకుడెవరైనా పిచ్చిగా భారతపై అణ్వస్త్ర దాడికి తెగబడ్డాడే అనుకుందాం… అప్పుడు భారత ఎదురుదాడి ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రపంచ పటంలో పాకిస్థాన్‌ ఉనికి సైతం ప్రశ్నార్థమయ్యేంత’’ అని ఆయన చెప్పారు. సున్నితమైన ఈ అంశంపై పద్మనాభన్‌ ఇంత బాహాటంగా మాట్లాడడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. నాటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఆ మర్నాడు పద్మనాభన్‌ను పిలిచి మందలించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే పద్మనాభన్‌ ప్రకటన పాక్‌ అణు దాడిపై భారత ఆర్మీ దృక్పథాన్ని తొలిసారిగా బయటపెట్టింది.

The Above Story clears that Pakistan should stop its illegitimate activities to save their Nation… Once the Tolerance is lost from India they can’t protect themselves. The Statement of Obama and the acts of Iran are also strengthening the Reactions of India.

general-s-padmanabhan

Comments

comments

You may also like...