కలబంద ఉపయోగాలు

సర్వరో గాలను నివారించే శక్తి కలబం దకు మాత్రమే ఉందని నిపు ణులు అంటున్నారు. అది ఒక దివ్య ఔషదం. సాధా రణంగా ఇంటికి దిష్టి తగల కుండా పెంచుకునే ఈ మొక్క లోని లాభాలను ప్రజలే ఇప్పుడిప్పుడే అందరూ గ్రహిస్తున్నారు. కల బంద రసం ఆరో గ్యానికి ఎంతో ప్రయోజన కరమని శాస్త్రవేత్తలు కూడా నిరూ పించారు. దీనిలో ఉన్న విటమిన్లు పలు రోగాలకు ఆద్భుతంగా పని చేస్తాయి. కలబందలో 99.3 శాతం నీరు, ఎబి కాంప్లెక్స్‌ విటమిన్లు, ఎంజైమ్‌లు, మిన రల్స్‌, అండ్రోక్వికోన్లు, అమైనో యాసిడ్లు ఉంటాయి. కల బంద మిశ్రమం రాసుకుంటే అనేక దీర్ఘకాలిక రోగాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబు తున్నారు. అందుకే ఇపుడు ఏ ఇంట చూసినా కలబంద మొక్క కనువిందు చేస్తుంది.
రసం తయారి విధానం
కలబంద ఆకులను సేకరించి ముందుగా శుభ్రం చేయాలి. ఆకులపై పొరను తొలగించి గుజ్జును సేకరించాలి. కలబంద గుజ్జు పది టీ స్పూన్లు, పాల మీగడ ఐదు టీ స్పూన్లు, కొబ్బరి నూనె రెండు స్పూన్లు, వంట ఉపు ఒక స్పూను కలిపి రసం తయారు చేయాలి.
కావాల్సిన పదార్దాలు
కలబంద గుజ్జు ఒక గ్లాస్‌, తాగు నీరు తగినంత, తేనె, ఉప్పు.
ఉపయోగాలు
కలబంద రసం తాగడం వల్ల శరీరంలో అంతర్గత వ్యాధులు తొలగి పోతాయి. ఇందులో బ్యాక్టీరియా, వైరస్‌, వ్యాధు లను నివారించే శక్తి ఉంది. కడుపులో మంట, గుండె జబ్బు, క్యాన్సర్‌, కీడ్నీ సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చెవి, ముక్కు, గొంతు, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సూర్యరశ్మి, వేడినుంచి రక్షణ, కీటకాలు కుట్టినపుడు ప్రథమ చికిత్సగా ఉపయోగపడుతుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *