బరువు తగ్గడానికి చిట్కాలు ఇవి

diabetic

 • ప్రతి ఒక్కరూ.. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.
 •  ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగాలి
 •  ఉదయం పొట్ట భాగంలో నూనెతో(కొబ్బరినూనె, నువ్వులనూనె, ఆలివ్‌ నూనె) ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్‌ చేయాలి.
 •  ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం(వాకింగ్‌, జాగింగ్‌) చేయాలి.
 •  ప్రతిరోజూ పది నిమిషాల పాటు ఉదయం సూర్యకాంతిలో ఉండాలి.
 •  ఉదయం 9 గంటల లోపే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేయాలి.
 •  వీటిలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 •  మధ్యాహ్నం 1 గంటలోపు లంచ తీసుకోవాలి.
 •  రాత్రి 7 గంటల లోపే రాత్రి భోజనం ముగించాలి.
 •  సి-విటమిన్‌ అధికంగా ఉండే.. బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, స్ట్రాబెర్రీ, యాపిల్‌ తీసుకోవాలి.
 •  భోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
 •  రోజూ కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
 •  మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
 •  బయట దొరికే జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
 •  రాత్రి వేళ కనీసం ఏడు గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి.
 •  ఇలా చేస్తే మీలక్ష్యం నెరవేరి అధిక బరువు నుంచి విముక్తి పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు.
 •  మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

 

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *