Tickets to be given in Bus itself for APSRTC Non-Stop

ఆర్టీసీ నాన్ స్టాప్ సర్వీసులకు కౌంటర్‌లో టికెట్లు తీసుకునే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై బస్సులోనే టికెట్లు అందజేయనున్నారు. గుంటూరు బస్టాండ్‌లో గుంటూరు – విజయవాడ, గుంటూరు – తెనాలి, గుంటూరు – నరసరావుపేట నాన స్టాప్‌ సర్వీసుల కోసం ప్రత్యేక టికెట్‌ కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లగేజీతో వచ్చి క్యూలో నిల్చుని, మళ్లీ లగేజీతో బస్సు నెంబర్లు వెతుక్కోవటం ప్రయాసగా ఉంటోందని భావించిన రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి నానస్టా్‌ప కౌంటర్‌లను మూసివేసి బస్సులోనే టికెట్లు అందజేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దాంతో నానస్టా్‌ప సర్వీసుల కౌంటర్‌లను మూసివేశారు. కండక్టర్‌లను ఏర్పాటు చేసి టిమ్‌ మిషన్‌లను అందజేశారు. ఇకపై బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు ఎటువంటి ప్రయాసలు పడాల్సిన అవసరం లేదని ఆర్‌ఎం పేర్కొన్నారు. నాన్‌స్టాప్‌ సర్వీసుల కౌంటర్‌లను మూసివేయటంపై కొందరు కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కండక్టర్లను ఇబ్బందులకు గురిచేయటం తప్పితే ఇందులో మరొకటి లేదని విమర్శిస్తున్నారు.

Comments

comments

You may also like...