ఓం శ్రీసాయిరాం…శ్రీ సాయి సూక్తి

sairam6“శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, సుదాముడు వీరు ముగ్గురూ సాందీపముని ఆశ్రమంలో ఆయన వద్ద విద్య నేర్చుకుంటూ ఉన్నారు. గురువుగారు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు కొట్టి తీసుకొని రమ్మని పంపించారు. సాందీపముని భార్య కూడా సుదాముడిని అదేపనిమీద పంపిస్తూ ముగ్గురికోసం వేయించిన శనగలనిచ్చింది. కృష్ణుడు సుదాముడిని అడవిలో కలసికొని “అన్నా, దాహం వేస్తూ ఉంది. మంచినీరు కావాలని” అడిగాడు. అపుడు సుదాముడు ఏమీ తినకుండా పరగడుపున నీళ్ళు త్రాగరాదు కాసేపు పడుకో అని అన్నాడేగాని, తన వద్ద శనగలు ఉన్నాగాని వాటిని తిని మంచినీరు త్రాగమని కూడా అనలేదు. కృష్ణుడు సుదాముడి వడిలో తలపెట్టుకొని పడుకొన్నాడు. అది చూసి సుదాముడు శనగలు తినసాగాడు. అపుడు కృష్ణుడు “అన్నా, ఏమిటి తింటున్నావు? చప్పుడవుతూ ఉంది” అని అన్నాడు. అప్పుడు సుదాముడు “ఇక్కడ తినడానికేముంది? చలికి వణుకు వచ్చి పళ్ళు పటపటమంటున్నాయి అంతే, అసలు విష్ణుసహస్రనామం స్పష్టంగా ఉఛ్ఛరించలేకపోతున్నాను” అని సమాధానమిచ్చాడు. ఈమాటలు విని సర్వసాక్షియైన కృష్ణపరమాత్మ, “నాకొక స్వప్నం వచ్చింది. అందులో ఒకరి వస్తువును మరొకడు తింటుండగా అతనిని ఏమిటి తింటున్నావని అడిగాను.” ఏముంది? తినడానికి మట్టి అన్నాడు. అపుడు ఆప్రశ్న అడిగినవాడు ‘తధాస్తు’ అన్నాడు. ఇది వట్టి స్వప్నమే అయినా నాకు పెట్టకుండా నువ్వు తింటావా అని అన్నాడు. సుదామునికి శ్రీకృష్ణుని లీలలు తెలియవు. దాని పరిణామం తర్వాత పరమ దారిద్ర్యాన్ననుభవించాడు. అందువల్ల ఒక్కరొక్కరే తినేవారు దీనినెప్పుడూ గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణపరమాత్మునికి స్నేహితుడయినాగాని సుదామునివంటి భక్తుడు తను చేసిన పొరబాటుకు కష్టాలననుభవించాడు. ఆతరువాత సుదాముడు తన భార్య చేసిన అటుకులను పిడెకెడు తెచ్చి ప్రేమతో శ్రీకృష్ణునకర్పిస్తే కృష్ణుడు ప్రసన్నుడై అతనికి ఐశ్వర్యాలనిచ్చి తృప్తి కలిగించాడు. “

అందువల్లనే సాయిబాబా అటువంటి చెడు ప్రవర్తన కలిగినవారి గురించి ఏవగింపుతో చెబుతూ ఉండేవారు. అటువంటివారితో కలిసి ఎటువంటి పనులూ చేయవద్దనీ, వారితో సన్నిహితంగా ఉండవద్దనీ తన భక్తులను హెచ్చరించారు. “మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తే అందులో తప్పేముంది” అనే వ్యక్తులు మూర్ఖులు. మంచినడత లేనివారిని మొట్టమొదటగానే మననుండి దూరంగా ఉంచాలి. వారితో కలిసిమెలిసి తిరగరాదు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *