నేను పక్కా లోకల్ అంటున్న యానిమేషన్ బొమ్మలు

జనతా గ్యారేజ్‌లో ”పక్కా లోకల్” సాంగ్‌లో కాజల్ చేసిన డాన్స్‌కి ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని ఉర్రూతలాడించింది. అంతే కాక దేవిశ్రీ అందించిన ట్యూన్ కూడా ఈ పాటకు ప్లస్ అయింది. అంత జోష్ ఉన్న ఈ పాటకు కాజల్‌తో పాటు మరో డ్యాన్సర్స్ కూడా తమ డాన్స్‌తో దుమ్ము లేపేశారు. ఇక్కడ డాన్స్ వేసింది హీరోనో, హీరోయిన్నో కాదండయ్… ఇక్కడ డాన్స్ వేసింది యానిమేషన్ బోమ్మలు మాత్రమే అయినప్పటికీ, ఈ వీడియో చూస్తే కాజల్ డాన్స్ బాగుందా, ఈ బొమ్మల డాన్స్ బాగుందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుందేమో. ఈ పాటను ప్రమోట్ చేసింది ఎన్టీఆర్ అభిమానులేనని తెలుస్తోంది. పక్కా లోకల్ పాట వారికి నచ్చడంతో  ”చిప్‌మంక్ వర్షన్‌”లో దానిని రూపోందించి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. దీనిని ఇప్పటికే లక్షా యాభైవేలకు పైగా షేర్ చేసుకున్నారంటే ఎంత పాపులర్ అయిందో అర్థమవుతోంది. జనతా గ్యారేజ్ విజయాన్ని ఆస్వాధించిన ఎన్టీఆర్ అభిమానులకు ఇది మరో కానుక అని చెప్ప వచ్చు. ఇంత పాపులర్ అయిన ఈ డాన్స్ వైపు మీరు ఓ లుక్కేయండి

Comments

comments

You may also like...