Mukhesh Ambani Stands as Richest Person in India

  • Stood in First Place for ninth year in a row
  • Increased wealth of Rs 1.5 lakh crore
  • Dilip Shanghvi second place in Forbes India list

forbes-india-logo

సంవత్సరమే మారింది. పేరు మారలేదు. దేశంలో అత్యంత శ్రీమంతునిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేతకు మళ్లీ అగ్రతాంబూలం దక్కింది. ఫోర్బ్స్‌ ఇండియా సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిది ఏడాది కూడా ముకేశ్‌ అంబానీనే ప్రథమ స్థానం వరించింది. ఈయన సంపద పెరిగి 2270 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) చేరింది. ఏడాది క్రితం ఈ విలువ 1890 కోట్ల డాలర్లు. సన్‌ ఫార్మా షేర్లు డీలా పడటంతో 110 కోట్ల డాలర్ల సంపదను కోల్పోయినప్పటికీ దిలీప్‌ సంఘ్వీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 100 మందితో కూడిన ఈ జాబితాలో హిందుజా కుటుంబం మూడో స్థానానికి ఎగబాకగా.. విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ నాలుగో స్థానానికి దిగారు.
జాబితాలో ప్రముఖులు ఇలా..
* బ్రిజ్‌ మోహన్‌లాల్‌ స్థానంలో ఆయన కుమారుడు పవన్‌ ముంజాల్‌ తొలిసారి జాబితాలో చోటు దక్కించుకున్నారు. 365 కోట్ల డాలర్లతో ఈయనకు 29వ స్థానం దక్కింది.
* రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ స్థానం 29 నుంచి 32కి పడిపోయింది. ఈయన సంపద విలువ 340 కోట్ల డాలర్లు.
* తొలి పది స్థానాల్లో పల్లోంజీ మిస్త్రీ (1390 కోట్ల డాలర్లు), లక్ష్మీ మిత్తల్‌ (120 కోట్ల డాలర్లు), గోద్రేజ్‌ కుటుంబం (1240 కోట్ల డాలర్లు), శివ్‌ నాడార్‌ (1140 కోట్ల డాలర్లు), కుమార్‌ మంగళం బిర్లా (880 కోట్ల డాలర్లు), సైరస్‌ పునావాలా (860 కోట్ల డాలర్లు) ఉన్నారు.
* 830 కోట్ల డాలర్ల సంపదతో ఉదయ్‌ కోటక్‌ 11వ స్థానంలో నిలవగా, గౌతమ్‌ అదానీకి 13వ స్థానం (630 కోట్ల డాలర్లు) దక్కింది.
* ఆనంద్‌ బుర్మాన్‌, శశి- రవి రుయా, బజాజ్‌ కుటుంబం పేర్లు మొదటి 20 మందిలో ఉన్నాయి. ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలాకు చోటు లభించింది. అలాగే ఇన్ఫోసిస్‌ మాజీ ఛైర్మన్‌ ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి (62వ స్థానం), నందన్‌ నీలేకని (80వ), ఎస్‌.గోపాల్‌ కృష్ణన్‌, (81వ), ఆనంద్‌ మహీంద్రా (90వ), అనిల్‌ అగర్వాల్‌ (63), మల్విందర్‌- శివిందర్‌ సింగ్‌ (92వ) కూడా జాబితాలో స్థానం పొందారు.

పతంజలి బాలకృష్ణ మెరుపుల్‌
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణ ఫోర్బ్స్‌ జాబితాలో తొలిసారి స్థానం సంపాదించారు. 250 కోట్ల డాలర్లతో ఈయనకు 48వ స్థానం లభించింది. పతంజలి ఆయుర్వేద్‌లో బాలకృష్ణకు 97 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. 2006లో రామ్‌దేవ్‌తో కలిసి ఈ సంస్థను స్థాపించారు. పతంజలి ఆయుర్వేద్‌కు రామ్‌దేవ్‌ ప్రచారకర్త కాగా.. కార్యకలాపాల బాధ్యతలు చేసుకునేది బాలకృష్ణే. మరోవైపు ప్లిఫ్‌కార్ట్‌ సహవ్యవస్థాపకులు సచిన్‌, బిన్నీ బన్సాల్‌లకు ఈ సారి జాబితాలో చోటు దక్కలేదు.
గుజరాతీయుల హవా
ఫోర్బ్స్‌ రూపొందించిన 100 మంది శ్రీమంతుల జాబితాలో గుజరాతీయుల హవా కొనసాగింది. ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, దిలీప్‌ సంఘ్వీ, గౌతమ్‌ అదానీ, ఉదయ్‌ కోటక్‌, శశి- రవి రుయా.. ఇలా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఈ జాబితాలో ఎక్కువగానే ఉన్నాయి.
సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్‌
ఫోర్బ్స్‌ జాబితాలో నలుగురు మహిళలు మాత్రమే చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌ మరోమారు నిలిచారు. ఈమెతో పాటు బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షా, వినోద్‌ గుప్తా (హావెల్స్‌), లీనా తివారీ (యూఎస్‌వీ ఫార్మా) స్థానం పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురు మహిళల సంయుక్త సంపద 1128 కోట్ల డాలర్లు.
పాతిక లక్షల కోట్లు
100 మంది సంపన్నుల సంయుక్త సంపద ఇది. ఈ మొత్తంలో తొలి 20 మంది సంపద 52 శాతం వరకు ఉంటుంది.
గతేడాది నమోదైన 55 శాతంతో పోలిస్తే ఇది తక్కువ.
125 కోట్ల డాలర్లు
ఈసారి జాబితాలో చోటు దక్కడానికి కావాల్సిన కనీస సంపద 125 కోట్ల డాలర్లు. 2015లో ఈ విలువ 110 కోట్ల డాలర్లుగా ఉంది.
6 జాబితాలో కొత్త పేర్లు
8 పునఃప్రవేశించినవారు
13 తిరిగి చోటు దక్కనివారు
4 మహిళలు

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *