కందుకూరి వీరేశలింగం పంతులుగారు

కందుకూరి వీరేశలింగం పంతులుగారు నవయుగ వైతాళికుడు.గొప్ప సంఘసంస్కర్త, రచయిత,కవి..
కందుకూరి వీరేశలింగం గారు1848 ఏప్రిల్‌ 16న జన్మించారు.తెలుగు జాతి గర్వించదగిన. మహోన్నత వ్యక్తి. సామాజిక దురాచారాలు రూపుమాపడానికి అసమానమైన కృషి చేసిన మహానుభావుడు. సాహితీరంగంలోనూ నిరుపమానమైన కృషిచేసిన ప్రఙ్ఞాశాలి.130 కి పైగా గ్రంథాలు రాశారు. తెలుగు లో అన్ని రచనలు చేసిన వారు అరుదు.
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, వీరేశలింగం పంతులుగారే.తెలుగులో మొదటి Auto biography ఆయనదే,తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర వారిదే. ఉద్యోగపర్వంలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి, పిల్లకు పాఠాలతో పాటు సంఘసంస్కరణ భావాలను కూడా బోధించారు.
ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజాన్ని స్థాపించింది వీరేశలింగం పంతులుగారే.ఆంధ్రరాష్ట్రంలో సంఘసంస్కరణలకు నాంది పలికింది వీరేశలింగం గారే.
యుగకర్తగా,ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు కూడ ఉంది.

sri-kandukuri-veeresalingam-panthulu

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *