Industrial plan to develop Visakhapatnam

Andhra Pradesh Government has Formulated Industrial Policy with the approval of the Cabinet.

As part of today discussion many important developmental policies have been approved and finalized, introducing technology into the administration by using CC Camers, Drones, Hardware, Software particularly in Public Listed Companies.

పరిపాలనకు ఆధునిక సాంకేతిక నైపుణాన్ని జతచేసేందుకు వీలుగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు ప్రత్యేకంగా పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి నిర్ణయించింది. పారిశ్రామిక నడవాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణకు నడిచి వెళ్లేంత దూరంలో ఆర్థిక నగరాల్ని నెలకొల్పాలని తీర్మానించింది. విశాఖ నగర అభివృద్ధికి వివిధ ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. అన్ని రూపాల్లో విమానాశ్రయం అభివృద్ధి నుంచి కొత్తగా అక్కడ అంతర్జాతీయ పాఠశాల, గోల్ప్‌ కోర్సు వరకు పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి విలేకరులకు వెల్లడించారు.
* ఉద్యోగులు వారి నివాసం నుంచి నడిచి వెళ్లేంత దూరంలో పారిశ్రామిక నడవాలు ఉండేలా ఆర్థిక నగరాల ఏర్పాటు. ఏపీఐఐసీ, ఏపీటీఎస్‌డీఐసీఓ సంయుక్త భాగస్వామ్యంతో సెజ్‌ల తరహాలో ఈ పారిశ్రామిక పార్క్‌ల అభివృద్ధి.
* సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇతర హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన పరికరాల కొనుగోలుకి ప్రత్యేకంగా పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీ ఏర్పాటు. డీజీపీ, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రధాన బాధ్యుడు, ఫైబర్‌గ్రిడ్‌ ఎండీ, ఆర్థిక, ఐటీశాఖల కార్యదర్శులతో కూడిన రియల్‌ టైం గవర్నెన్స్‌ బోర్డు ఈ కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
* పౌరవిమానయాన రంగంలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోటానికి అంగీకారం. విశాఖ విమానాశ్రయం రన్‌వేని విస్తరించి అభివృద్ధి చేయాలని నిర్ణయం.
* జిల్లా స్థాయి పర్యాటక మండళ్ల ఏర్పాటు. అమరావతి(విజయవాడ), విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిల్లో నగర పర్యాటక మండళ్ల ఏర్పాటు. ఏడాదికి ఎకరా రూ.5 కోట్ల చొప్పున లీజు విలువకు లోబడి గాని, 2.5ఎకరాల వరకు ప్రభుత్వ భూమి… వీటిల్లో ఏది తక్కువుంటే దానిని పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించే అధికారం ఈ మండళ్లకు అప్పగింత.
* పశుసంవర్ధకశాఖలో రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా 300 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ.
* ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా కొనుగోలు పోర్టల్‌ ఏర్పాటు చేయాలని ఐటీశాఖ చేసిన ప్రతిపాదనకు తిరస్కరణ.అందుబాటులో ఉన్న పోర్టర్లనే దీనికి వాడుకోవాలని, అవసరమైతే బిడ్డింగ్‌ ద్వారా సంస్థల్ని ఎంపిక చేయాలని సూచన.
* విశాఖపట్నం జిల్లా అడవి రామవరంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేయటానికి అభివృద్ధిదారుగా ప్రియదర్శిని ఎడ్యుకేషనల్‌ సొసైటీ, నోవా ఎడ్యుకేషనల్‌ సొసైటీలతో కూడిన కన్సార్టియం ఎంపిక. లండన్‌లోని ప్రఖ్యాత కింగ్స్‌ కళాశాలతో వీరికి ఒప్పందం ఉంది. దేవాదాయశాఖకి చెందిన ఆ భూమికి ఎకరాకి రూ.లక్ష చొప్పున లీజు, ఆదాయంలో వాటా ఇవ్వాలని నిర్ణయం.
* గోల్ఫ్‌ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలోని ముడసర్లోవలో 12.72ఎకరాలు ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు కేటాయింపు.
* ఏపీ బీసీ కమిషన్‌ సూచన మేరకు బీసీ-డీ జాబితా 28వ క్రమసంఖ్యలో ఉన్న ‘సాతాని’ అనే మాటను తొలగించి దాని స్థానంలో ‘చాత్తాద శ్రీవైష్ణవ’ అనే పదాన్ని చేర్చటానికి ఆమోదం.
* పురపాలకశాఖలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం అమలులో భాగంగా వివిధ పనులు చేపట్టిన వీఎంసీ అధికారులు జీఓలు 94, 504లను ఉల్లంఘించారన్న ఆరోపణలపై తదుపరి చర్యలు చేపట్టకుండా నిలిపివేయాలి.
* ఫెర్రో అల్లాయిస్‌ ఉత్పత్తిదారుల సంఘం అభ్యర్ధన మేరకు ఆ పరిశ్రమకు విద్యుత్తు బిల్లుల్లో రాయితీ, మినహాయింపు, వాయిదాల్లో చెల్లింపులకు షరతులతో కూడిన అనుమతి.
* శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో 209.84ఎకరాల భూమిని వేదిక్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు నిమిత్తం శ్రీమత్‌ ఉభయ వేదాంతచార్య పీఠానికి 50 ఎకరాల్ని ఎకరా రూ.1.5లక్షల చొప్పున, మిగిలిన భూమిని ఎకరా రూ.50వేల చొప్పున కేటాయింపు. రూ.350కోట్లతో దీనిని నాలుగేళ్లలో నిర్మించాలి.
* జిల్లాకు ఒక బీసీ భవన్‌ నిర్మాణం, బీసీ విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసం నిర్ణయాలకు ఆమోదం.
* నగరపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పొరుగుసేవల కార్మికులకు వేతనాల పెంపు.
* చెరకు బకాయిల విడుదలకు సహకార చక్కెర కర్మాగారాలకు రూ.35.76కోట్లు క్రెడిట్‌ ఆథరైజేషన్‌ ఇచ్చేందుకు అనుమతి. ఒక్కో రైతుకు రూ.3వేల చొప్పున చెల్లించాలి.
* నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నంలో 52.22ఎకరాల భూమిని రూ.542కోట్ల పెట్టుబడితో టయోటా నెక్కంటి మెగా ఫుడ్‌పార్క్‌ నిర్మించే చక్కెర శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు కేటాయింపు.
తిరుపతిలో ఆల్‌ఇండియా సైన్స్‌ కాంగ్రెస్‌
తిరుపతిలో ఆల్‌ఇండియా సైన్స్‌ కాంగ్రెస్‌ని నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. వచ్చే జనవరి 3వ తేదీ నుంచి అయిదు రోజులపాటు ఇవి జరుగుతాయి. ప్రధాని నరేంద్రమోదీ వీటిని ప్రారంభిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు జిల్లా పరిధిలోని సీతానగరం కొండపై బుద్ధుని విగ్రహం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి మంత్రులు, ముఖ్యకార్యదర్శులు రాకపోవటాన్ని సీఎం ప్రస్తావిస్తూ… అది తన ఒక్కడిదే కాదని అంతా రావాల్సిందేనని ఆదేశించారు. ఈసందర్భంగా అక్కడ వసతి కోసం డార్మిటరీలు ఏర్పాటు చేద్దామని అన్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *