కాశీ విశిష్టత.. కాశీ వెళ్ళడం వాళ్ళ ప్రయోజనాలు

“కాశీ” అంటే ప్రకాశము, వెలుగు, తేజస్సు, కాంతి అని అర్థాలు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాశీలో ఉన్న “విశ్వేశ్వరలింగం” అత్యుత్తమైమదిగా భక్తుల అభిప్రాయము. మూడు రాత్రులు, 3 పగళ్లూ కాశీలో ఉంటే ‘రాజసూయయాగం + అశ్వమేధయాగం’ చేసిన ఫలితం వస్తుంది. కాశీ నగరం ద్వాదశ నామాలతో ప్రసిద్ధి చెందినది, అవి “కాశీ, వారణాసి, బెనారస్, శివపురి, క్షేత్రపురి, త్రిపురారి, రాజనగరి, ఆనందకావనం, గౌరీముఖి, అవిముక్తి, మోక్షపురి, జ్ఞానపురి”.
కాశీలోని మణికర్ణిక తీర్ధంలో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన ‘బిందుమాధవ క్షేత్రం’ కాశీలో ఉంది. అస్సీ ఘాట్ దగ్గర ఉన్న లోలార్క్ కుండ్ లో సూర్యుడు ఉన్నాడు. లోలార్క్ కుండ్లో ఎర్రచందనం, ఎర్రపూలను వేసి నమస్కారం చేయాలి.
కాశీలో ‘అన్నపూర్ణ’ అమ్మ వారి చేతిలో అన్నపు భాండము, గరిటె ఉంటాయి. ఇక్కడి “విశాలాక్షి” అమ్మవారు త్రిశక్తి పీఠాలు (కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి)లో ఒకటిగా, అష్టాదశ పీఠాల్లో ఒకటిగా, అష్టశత శక్తులు(108 శక్తి పీఠాలు)లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.
సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ శబ్దమును నిరూపించుకొన్మది ఇక్కడే. తులసీదాసు రామాయణాన్ని రాసిందీ ఇక్కడే.
ఆదిశంకరులు ఇలా అంటారు “ఆనందమునకు మూలానందమైన ఆనందకాననం (కాశీ)లో నివసిస్తూ, పాపాలను తుంచివేసే, అనాధలకు నాధడైన కాశీనాధుడు విశ్వనాధుడ్ని శరణువేడుకుంటున్నాను” అన్నారు. భజగోవిందంలో గంగా నది గురించి “గంగాజల లవకణికా పీతా” అంటూ గంగమ్మ నీరు ఒక్క చుక్క తాగినా, యముడి వద్దకు వెళ్ళాల్సిన పని ఉండదంటారు జగద్గురువులు.
క్షేత్రపాలకుడైన ‘కాలభైరవుడిని’ తప్పక దర్శించుకోవాలి, ఇతని మరో పేరు ‘క్రోధ భైరవ దేవుడు’. సాక్షి గణపతిని తప్పక దర్శించాలి.
శ్రీవిశ్వనాధుడి హారతి (ఉ.3గం.కు) సేవకు ₹251, అభిషేకానికి ₹190 చెల్లించాలి. అన్నపూర్ణమ్మ కుంకుమ పూజకు ₹250 చెల్లించాలి.

“గంగా తరంగ కమనీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామబాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం
వారణాసీపుర పతిం భజ విశ్వనాధం”

“ఓం నమశ్శివాయ”
“ఓం నమశ్శివాయ”
“ఓం నమశ్శివాయ”

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *