కంటి చూపును మెరుగు పరచు కోవడం ఎలా

సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు. కళ్ళు బాగుంటేనే మన నడక నడవడికా అన్నీ బావుంటాయి. ముందు చూపు లేని వాడు కొంటి చూపు లేని వాడు జీవితం లో ఎదగలేరు. మనిషి బ్రతికి ఉన్నప్పుడే కాదు ఆ మనిషి చనిపోయాకా కూడా ఇంకొకరికి జీవితాన్ని ఇస్తాయి కళ్ళు. అందుకే నేత్రదానం అంత గొప్పది అయ్యింది. అయితే ఇంతటి ముఖ్యమైన కళ్ళకు చూపు మందగించే పరిస్థితి వస్తోంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ఇక ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటోంది. రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు.

కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు, వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు, మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే, కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి రానేరాదు.

fruit-and-vegetables

1. కంటిచూపు కూడా విటమిన్ల లోపం వల్లనే వస్తుంది, చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే మనం మన కంటిచూపుని తిరిగి పొందవచ్చు.

amla-juice

2. పది పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ ను తీయాలి. ఈ జ్యూస్ ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీంతో దృష్టి బాగా వస్తుంది.

3. అరకిలో వాల్ నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. అయితే, 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.

4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.

hit-anti-aging-food-to-look-younger-than-you-are-1

5. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి. కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

Comments

comments

You may also like...