High Alert at Punjab Retreat Banned at Vagha Border

పాక్ ఆక్రమిక కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత సైనికులు మెరుపు దాడులు చేసి 38 మందిని మట్టుబెట్టిన నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులో భారత ఆర్మీ హై అలెర్ట్ అయ్యింది. పాకిస్థాన్ కవ్వింపు దాడులకు దిగే అవకాశం ఉన్నందున సైనిక బలగాలను భారీగా మోహరిస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్తగా సరిహద్దు నుంచి పది కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక వాఘా బోర్డర్‌లో నిత్యం జరిగే ఇరు దేశాల సైనికుల రిట్రీట్ విన్యాసాలు రద్దు చేశారు.
పంజాబ్‌లో భారత్‌, పాక్ మధ్య 553 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇరు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం వచ్చినా పంజాబ్ సరిహద్దే కీలకం. 1965, 1971లో జరిగిన భారత్, పాక్ యుద్ధాల్లో ఇరు దేశాల సైనిక బలగాలు ముఖాముఖిగా తలపడింది ఇక్కడే. ఈనేపథ్యంలో పంజాబ్ సరిహద్దులో ఆర్మీ, వైమానిక దళాలను అప్రమత్తం చేశారు. ఇటు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను అలెర్ట్ చేసింది. పోలీస్, వైద్య శాఖల సెలవులు రద్దు చేసి అలెర్టుగా ఉంచింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్‌తో పాటు బెంగాల్, బీహార్, ఒడిశాతో పాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పీవోకేలో భారత్ చేపట్టిన సైనిక ఆపరేషన్‌ను వారికి వివరించారు.
bsf-border

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *