విజయవాడ స్టేడియం లో హెలిప్యాడ్.. సింథటిక్ ట్రాక్ వైజాగ్ కు తరలింపు

విజయవాడ స్టేడియం లో హెలిప్యాడ్..
సింథటిక్ ట్రాక్ వైజాగ్ కు తరలింపు ….
ఒలింపిక్స్ సంగతి సరే … ట్రాక్ పాయే….
వాట్ ఎన్ ఐడియా బాబూ జీ……
ఆంధ్ర ప్రదేశ్ కు క్రీడా సంస్కృతిని తానే పరిచయం చేసానన్న ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పాలన విజయవాడ లో ఇందిరాగాంధి మునిసిపల్ స్టేడియం కు ఓ శాపం గా తయారయ్యింది. అంతర్జాతీయ వన్ డే క్రికెట్ మేచ్ లకు అనేక క్రీడా సంభరాలకు వేదికగా నిలిచిన స్టేడియం నేడు హెలిప్యాడ్ గా మారిపోయింది.v పీ డబ్ల్యూ గ్రౌండ్స్ అమ్మేసిన నేపధ్యం లో అనేక ప్రైవేట్ , ప్రభుత్వ కార్యక్రామాలకు కుడా అదే వేదికయ్యింది. ఆ స్టేడియం తప్ప మరో అనువైన ప్రాంతం ప్రభుత్వానికి దొరకలేదట. దాంతో ఈ స్టేడియం లో ఏర్పాటు చేయతలపెట్టిన 400 మిటర్ల నిడివిగలిగిన ఏతల్టిక్ సింథటిక్ ట్రాక్ ను విశాఖపట్టణం కు తరలిమ్చనున్నట్టు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఎల వీ సుభ్రమణ్యం ప్రకటించారు. ఈ ట్రాక్ ను ఏర్పాటుకు విశాఖ పట్టణం మధ్యలో ఎక్కడా అనువైన ప్రదేశం దొరకలేదట. భిమునిపట్టణం లో గాని వైజాగ్ స్టీల్ సిటీ లో గాని ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నారు. క్రీడాకారులకు అత్యంత అనువుగా విజయవాడ మధ్యలో వున్న ఐ జీ ఎం సీ ఎస్ ని కాదని ఎక్కడో భీముని పట్టణం తరలించడం ప్రభుత్వ అవగాహానా రాహిత్యాన్ని తెలియజేస్తున్నది. విజయవాడ లో హెలిప్యాడ్ కోసం గతం లో పీ డబ్ల్యూ డి గ్రౌండ్స్ ను వినియోగించేవారు. అక్కడే అనేక సభలు, సమావేశాలు జరిగేవి. అయితే బాబు అధికారం లోనికి వచ్చిన వెంటనే అది ప్రైవేట్ పరమై పోయింది. ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినా బాబు మాట వినరు గదా …! ఇప్పుడు హెలిప్యాడ్ కు స్థలం దొరకక పోవడం తో క్రీడా వేదిక పై ప్రభుత్వ దృష్టి పడింది. అంతే 2018 వరకు క్రీడలకు స్టేడియం దూరం. ఇదే మన ఘనత వహించిన ముఖ్యమంత్రి గారీ క్రిడాభిమానం. హెలిప్యాడ్ కోసం క్రిడాభివ్రుద్దికి ఎంతగానో ఉపయోగపడే సింథటిక్ టర్ఫ్ ను వైజాగ్ తరిమ్చేస్తున్నారు. అమరావతి కి ఒలింపిక్స్ తెస్తారో లేదో తెలియదు గాని …. విజయవాడ నుండి విజాగ్ కు టర్ఫ్ తరిలిపోయింది . ఇది బాబు గారి ముందు చూపుకో మచ్చు తునక ..,.,.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *