మన అమరావతి సుందర నగరం గా వెలసేనా? మన కలల రాజధాని ఎలా నిర్మిస్తారు?

ఆంద్ర ప్రదేశ్ కోసం నిర్మిస్తున్న ప్రపంచ స్తాయి రాజదాని అమరావతి ఏర్పాటు చేయడం కోసం సమీకరించిన భూమిని 25 మిటర్ల మేర ఎత్తు చేయడం సాధ్యమా ….? అంత మేరకు భూమిని ఎత్తు చేయక పోతే కృష్ణా నది వరదలకు, కొండవీటి వాగు ముంపుకు గురికాక తప్పదట…! నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులకు సంబందించి గ్రీన్ ట్రిబ్యునల్ లో దాకలైన వాజ్యం పై జరుగుతున్న విచారణలో ఆ మేరకు భూమిని ఎత్తు చేయడం సాధ్యమేనా …? అని ప్రశ్నించినప్పుడు… ఎపి ప్రభుత్వం తరుపు న్యాయవాది నోట మాట రాక గుడ్లు తేలేశారు. పిటిషనర్ల వాదన ప్రకారం కొండవీటి వాగు సరాసరి నీటి మట్టం 22 మీటర్లు. ఈ నీటిమట్టం కు ఐదు మిటర్ల ఎత్తు వరకు ఫ్లడ్ బ్యాంక్ లను నిర్మించారు. ఆ ఎత్తుకు రాజాదాని నిర్మిస్తున్న 10,600 ఎకరాల భూమిని ఎత్తు చేయక పోతే ముప్పురాదా..? ట్రిబ్యునల్ ప్రిస్నిస్తున్నది. కాగా కృష్ణా, కొండవీటి వాగు వరదల పరివాహక ప్రాంతం లో రాజదానిని, అదీ లోతట్టు ప్రాంతం లో నిర్మిస్తున్నందువల్ల అది వానాకాలం లో అనేక రోజుల పాటు వరద నీటిలో మునిగితెలాల్సి వస్తాదని పిటిషనర్ల వాదన .
కొద్ది గంటల పాటు వర్షం పడితేనే ముంబాయి, కొలకత్త,చెన్నై, హైదరాబాద్ నగరాలు యెంత దారుణం గా విలవిల లాడి పోతున్నాయో మనం నిత్యం చూస్తూనే వున్నాం. అటువంటిది కృష్ణ, కొండవీటి వాగు వరద పరివాక ప్రాంతం లో నిర్మిస్తున్న ప్రపంచ స్థాయి రాజదాని లో ఎన్ని రోజుల పాటు నీట మునిగి వుంటుందో ….. మరిన్ని రోజులు పడవలో పయనిన్చాల్సి వుంటుందో వేచి చూడాలి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *