Follow the Given Suggestions to get rid of Naradrusthi

29.09.2016 గురువారం ఈ రోజు చాల చాల విశిష్టమైన అరుదైన యోగ క్షేమం

1. ఇంట్లో నరదుష్టి తోల్గుటకు,………?
2.ఇంట్లో గ్రహ దోషములు పోవుటకు..?
3. ఇంట్లో రోగ బాధలు నశించుటకు…?
4. వివాహ ,సంతాన దోషాలు నివారణకు ..?
5. శని దోష నివారణకు……?
……………………………………..ఏ యోగక్షేమం చేసుకోవాలి ?

ఈ రోజు మాసశివరాత్రి’ పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అని పురాణాలలో చెప్పబడింది ఈ రోజు
శివునికి అభిషేకం,శివపార్వతుల దర్శనం శ్రేయష్కరం అని పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజు ఇంట్లో నరదుష్టి తోల్గుటకు,.ఇంట్లో గ్రహ దోషములు పోవుటకు, ఇంట్లో రోగ బాధలు నశించుటకు,వివాహ ,సంతాన దోషాలు నివారణకు, శని దోష నివారణకు.మీ దగ్గేరలో వుండే శివ లయంలో 108 ప్రదక్షణలు
ఈక్రింద విదముగా ఈ క్రింద స్త్రోత్రం లేదా ఇ స్త్రోత్రం..అనగా ” ఒహ్ం శివాయన మహః ” అను స్త్రోత్రం నుపటిస్తూ ఈ క్రింది విదముగా ప్రదక్షణ చేయ్యవాలను.

shiva-puranam

శ్లో:-ధ్వజాత్ పృష్టం – పృష్టాత్ పృష్టమ్, పృష్టాత్ పృష్టం పృష్టాత్ ధ్వజమ్.

భావము:– శివాలయములో ధ్వజ స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి,
అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి
మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు వెళ్ళ
వలెను అని శ్లోక భావము. వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం| చండంచ సోమసూత్రంచ
పునశ్చండం పునర్వృషం|| శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్| లంఘనాత్సోమసూత్రస్య నరకే
పతనం ధృవం||

 lord-vishnu-shiva
01.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
02 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
03 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
04 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
05 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
06. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
07 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
08 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
09 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.

Comments

comments

You may also like...