Durgamma Shobha Yatra Concluded

వైభవంగా దుర్గమ్మ శోభాయాత్ర నిర్వహించారు. మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ నగర వీధుల్లో దుర్గమ్మ ఊరేగింపు జరిగింది. బ్రాహ్మణవీథి జమ్మిదొడ్డి నుంచి కొత్తపేట శ్రీనివాసమహల్‌, కెనాల్‌ రోడ్డు మీదుగా దేవస్థానం వరకు శోభాయాత్ర సాగింది.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉదయం 4 నుంచి రాత్రి 11 వరకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. సాయంత్రం 7 నుంచి 8 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో చెప్పారు.

Comments

comments

You may also like...