Delhi Municipality Introduces Terminator Train to Control Mosquitoes

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దోమల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక రైలును అధికారులు రంగంలోకి దింపారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తర రైల్వే డివిజన్ లు కలిసి దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రవేశపెట్టిన ‘టర్మినేటర్ ట్రైన్’ ను శుక్రవారం న్యూఢిల్లీ రైల్వేస్టేషను ఫ్లాట్ ఫాంపై ఆరంభించారు. రైలు పట్టాలపై దోమలను అరికట్టేందుకు వీలుగా క్రిమిసంహార మందును ఈ రైలుపై నుంచి స్ప్రే చేశారు. ఈ ప్రత్యేక రైలు నుంచి స్ప్రేయింగ్ యంత్రం ద్వారా 60 మీటర్ల దూరంలో దోమల నివారణ మందును చల్లారు. ఈ రైలు పట్టాల పక్కన ఉన్న మురికివాడల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఉపయోగపడుతుందంటారు డీఆర్ఎం అరుణ్ అరోరా. ఢిల్లీలో 1500 చికున్ గున్యా, 1,378 డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో దోమలను లార్వా దశలోనే నివారించేందుకు వీలుగా ఈ టర్మినేటర్ ట్రైన్ ను రంగంలోకి దించామని కమిషనర్ పునీత్ గోయల్ వివరించారు.

ఇలాంటి వినూత్న యంత్రాలని కేవలం ఢిల్లీ కి పరిమితం చెయ్యకుండా అన్ని ప్రాంతాలలలో ప్రవేశ పెడితే సరైన ప్రయోజనం ఉంటుంది. ముఖ్యం గా మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రవేశ పెట్టడం చాల అవసరం..

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *