Cyclone turns up into Thoofaan
అకాల వర్షాలు, తుపాన్ రెండూ కూడా అధిక వర్షాలకు దారి తీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని వరద పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పులిచింతలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుందని దీంతో ఆ నీటిని బయటకు వదులుతున్నామని, తద్వారా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. పొలాలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. గురువారం ఉదయం నుంచి గురజాల నియోజక వర్గంలో ఐదారు మండలాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీనివల్ల భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. వాగులో బస్సు చిక్కుకుందని, అందులో ప్రయణీకులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారని, అలాగే వాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులను కూడా కాపాడారని చంద్రబాబు వెల్లడించారు. రెండు హెలీకాఫ్టర్లనుకూడా రంగంలోకి దించామని, ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేశామని ఆయన అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.