Cities with beauty queens

అందానికి పర్యాయపదం మగువలే. అందం అంటే శారీరకమే కాదు, మానసికమైనది కూడా. కొందరు మగువల్ని రెప్పవాల్చకుండా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది! మరికొంతమంది మహిళలు ఎందరిలో ఉన్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తారు. అందం, ఆకర్షణ సమపాళ్ళలో కలిసి అందానికి నిఖార్సైన నిర్వచనంలా ఉండే స్ర్తీలు చాలా దేశాల్లో ఉన్నారు. ఇలా ప్రపంచ దేశాల్లో హాటెస్ట్‌ లేడీస్‌ ఉన్న నగరాలు ఏమున్నాయా అని జల్లెడపట్టి ఆ నగరాల జాబితా తయారుచేశారు. అవేంటో మీరూ తెలుసుకోండి!

మిలన్, ఇటలీ Milan, Italy

ఇటలీలోని మిలన్ నగరం ప్రపంచ ఫ్యాషన్ క్యాపిటల్‌గా పేరెన్నికగన్నది. అందువల్ల ఇక్కడ ప్రతీ సందులోనూ మోడల్సు, హాట్‌గాళ్స్‌ ఉంటారనడం ఆశ్చర్యం కాదు. గ్లామర్‌ ప్రపంచంలో ఉండే మోడల్సే కాదు, మిలన్ నగరంలో సాధారణ స్ర్తీలు కూడా ఎంతో అందంగా ఉంటారట. మోడలింగ్‌ పట్ల ఏమాత్రం ఆసక్తి చూపకపోయినాసరే వారి అందం కట్టిపడేసే విధంగా ఉంటుందని ఫ్యాషన ప్రేమికులు అంటారు.

కీవ్‌, ఉక్రెయిన్ Kiev Ukraine

ఉక్రెయిన్ నగరం కీవ్‌లో మహిళలు ప్రపంచంలోనే అందమైనవారని అంటారు. వారి అందం కనురెప్ప వాల్చనీయదు. ఎవ్వరినైనాసరే పాదా క్రాంతుల్ని చేసుకునేంత అందం వారిది అంటారు మోడలింగ్‌ నిపుణులు.

స్టాక్‌హోం, స్వీడన్ Stockholm, Sweden

స్వీడన్‌లోని స్టాక్‌హోం ప్రాంత మహిళలు చాలా హాట్‌గా ఉంటారు. కట్టి పడేసే నీలికళ్లు, రాగి రంగు జుట్టుతో ఎవ్వరి నైనా సరే తమవైపు తిప్పు కోగలరట.

ప్రేగ్‌, చెక్‌ రిపబ్లిక్‌  Prague, Czech Republic

ప్రేగ్‌ ప్రాంతం పేరు చెబితే బీర్‌ గుర్తుకు వస్తుంది కదా! కేవలం బీర్‌కి మాత్రమే కాదండోయ్‌ అందమైన అమ్మాయిలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి. ప్రేగ్‌లో పొడుగుకాళ్ల సుందరీ మణులు ఎక్కువ. ఈ సుందరీమణులు పొట్టి స్కర్టులు వేసుకుని రివర్‌సైడ్‌ నైట్‌ క్లబ్బుల్లో టేబుల్‌మీద నాట్యం చేస్తూ ఉంటే, ఆ అనుభవం నిజంగా స్వర్గ తుల్యమే అంటారు ఫ్యాషన్ ప్రేమికులు.

రియో డీజనీరో, బ్రెజిల్‌ Dijaniro Rio, Brazil

ఆకట్టుకునే అందం, శరీర సౌష్టవంగల స్ర్తీలు రియోలో ఉంటారు. రియో ప్రాంతం సముద్ర తీరాలకు, వెరైటీ ఫెస్టివల్స్‌కి పేరెన్నికగన్నది. అందమైన ప్రకృతితో పాటు అందమైన అమ్మాయిలను చూడాలన్న ఆకాం క్షతో చాలామంది పర్యాటకులు రియోకి వెళ్తుంటారు.

కరకాస్‌, వెనిజులా Karakas, Venezuela

అందమైన స్ర్తీలకి కేరాఫ్‌ అడ్రస్‌ కరకాస్‌. అయితే నేరాల సంఖ్యకి కూడా ఈ ప్రాంతం పెట్టింది పేరు. నేరం చేయడంలో ఆడ, మగా ఎవరైనా సిద్ధహస్తులేనట. ఈ పట్టణంలో నేరాలు ఎక్కువగా ఉండడంవల్ల అతి ప్రమాదకర నగరంగా దీనికి పేరు.

మాంట్రియల్‌, కెనడా Montreal, Canada

నిత్యం మోడల్స్‌తో కళకళలాడుతూ ఫ్యాషనగా కనిపించే నగరం మాంట్రియల్‌. మిలన తర్వాత దీన్నే అత్యంత ఫ్యాషనబుల్‌ నగరంగా పేర్కొనవచ్చు. అందమైన స్ర్తీలుండే నగరాల జాబితాలో మాంట్రియల్‌ ఎప్పుడూ తన ర్యాంకుని మెరుగుపరుచుకుంటూనే ఉంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *