కష్టాలలో JIO వినియోగదారులు… కాల్ డ్రాప్ తో ఇక్కట్లు

Jio నుంచి ఇతర నేత్వోర్కు లకి వచ్చే గట్టి పోటి ప్రప్రథమం గా ఫ్రీ వాయిస్ కాల్లింగ్.  ఫ్రీ వాయిస్ కాల్స్ విషయం లో ఏం చేయలేక ఇతర కంపెనీలు చేతులెత్తేశాయి.  కానీ రిలయన్స్ జియో తమ పొట్ట కొడుతున్నాయని భావించిన అన్ని కంపెనీలు ఒక్క విషయంలో మాత్రం ఏకమయ్యాయని జియో చెబుతోంది. తమ నెట్‌వర్క్ నుంచి చేసే కాల్స్‌పై అన్ని కంపెనీలు కక్ష కట్టాయని జియో ఆరోపిస్తోంది. 10 రోజుల నుంచి కాల్‌డ్రాప్స్‌తో తమ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జియో చెబుతోంది.jio-call-drops
కాల్ డ్రాప్స్ విషయంలో ఎయిర్‌టెల్‌ పైనే రిలయన్స్ జియో ప్రధానంగా ఆరోపిస్తోంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పలేక జియో నానా అవస్థలు పడుతోంది. జియో వినియోగదారులు ఒక్క వొడాఫోన్ నెట్‌వర్క్‌కే ఈ 10 రోజుల్లో 15 కోట్ల కాల్స్ ఫెయిలయినట్లు తెలిసింది. జియో నుంచి వొడాఫోన్‌కు 100 కాల్స్ చేస్తుంటే అందులో 80 కాల్స్ ఫెయినట్లు తేలింది. ఈ కాల్‌డ్రాప్స్ సమస్యతో దాదాపు రోజుకు 5లక్షల మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. టెలికామ్ కంపెనీల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం వినియోగదారులను చిక్కుల్లోకి నెట్టేస్తోంది. జియో ఇప్పటికే ఈ కాల్ డ్రాప్స్ విషయంపై ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. కానీ ఇంతవరకూ ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం దొరకలేదు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *