అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే

*కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.*
*లక్ష్యాన్ని సాదించేవరకు నిరాశకు, నిస్పృహకు చోటివ్వక పట్టుదలతో కొనసాగితే తప్పక విజయం నిన్నే వరిస్తుంది.*

*మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూస్తూవుంటాయి… ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే కనిపిస్తుంది.*

*ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి.*

ప్రేమ అనేది నీడ లాంటిది..అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది..కానీ స్నేహం దీపం లాంటిది.అది చీకటిలో కూడా నీ గమ్యంని చూపిస్తుంది.

నీవు ఎవరికైన ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు . ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోకు.

అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది . అలాగే దుఖం తరువాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది.

పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది . ఆత్మవిశ్వాసం మనిషిని విజయపధం వైపు నడిపిస్తుంది.

సమస్య వెనుక సమాదానం ఉంటుంది దుఃఖం వెనుక సుఖం ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది.

చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం ,ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చెయ్యడమే సామర్ధ్యం.

నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే పది వేళ్ళ కంటే,నువ్వు కనీళ్ళుపెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది.

ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ అతిత్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు.

అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు. తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞులు.

అందరూ నిన్నొదిలి పోతున్నప్పుడు అందర్నీ వదిలి నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.

ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.

మమకారం నీకు తోడును తెస్తుంది,అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది,అందుకే ప్రతి ఒక్కరు అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి.

తెలియక చేస్తే పొరపాటు.. తెలిసి చేస్తే తప్పు.. తప్పని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం.

తోటి వారందరిలోకి ప్రధములుగా ఉండాలని కోరుకోవడంలో,అందుకై ప్రయత్నించడం లో తప్పు లేదు.కానీ అలా ఉండకపోవడం తో మీ జీవితానికి విలువే లేదనుకోవడం పొరపాటు.

ఒకసారి వద్దని చెప్పిన తరువాత ఎదుటివారి బలవంతానికి ఎట్టి పరిస్థితులలోనూ లొంగిపోవద్దు.మీరు మొదట వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే తిరిగి వెల్లడించండి.ధృడంగా వ్యవహరించడం అలవాటుగా మారాలి.

నాన్నకి ప్రేమను ఎలా చూపించాలో తెలియదు..అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు.. వాళ్ళు ఏమి చేసినా అది నీ మంచి కోరే చేస్తారు .కాబట్టి అమ్మ మనస్సు,నాన్న మనస్సు తెలుసుకొని మెలగండి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *