Akkineni Nageswara Rao 93 Years Jayanthi Celebrations

డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి వేడుకల సందర్భం లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటే సమాజం బాగుంటుందని”, అటువంటి కుటుంబ వ్యవస్థ గొప్పగతనాన్ని చూపించే చిత్రాల్లోనే అక్కినేని నాగేశ్వరరావు అధికంగా నటించారని అయన అన్నారు అన్నారు. అక్కినేని గొప్ప నటుడని, ఆయన నటించిన ప్రతి పాత్రకూ వన్నె తెచ్చాని కీర్తించారు. రవీంద్రభారతిలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి అక్కినేని జీవన సాఫల పురస్కారం అందజేశారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా టీఎస్సార్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ టి.సుబ్బిరామిరెడ్డి గొప్ప సేవాభావం కలవారని అన్నారు. కళాకారుల ఎంతగానో ప్రోత్సాహించే ఆయన ఎంతో గొప్ప కళాపోషకుడని అన్నారు.

akkineni-nageswara-rao

ఇద్దరి పార్టీలు వేరైనా ఆయన వ్యక్తిత్వాన్ని తానెంతో గౌరవిస్తానని వెంకయ్య చెప్పారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ అక్కినేని ఏ ప్రాతలో నటించినా ఆ పాత్రకు జీవం పోశారని, దేవదాసు పాత్ర ఆయన కోసమే పుట్టిందా అనిపిస్తుందని అన్నారు. సుబ్బరామిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, అలనాటి సినీ తార జమున, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *