Airtel New 4G Plans

airtel-vs-jio-competition
భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల కోసం కొత్తగా 4జీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 90 రోజుల పాటు ఉచితంగా 4జీ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వినియోగదారులు రూ.1,495తో రీఛార్జ్‌ చేసుకోవాలి. అదే విధంగా కొత్త కస్టమర్లు రూ.1,494తో రీఛార్జ్‌ చేసుకుంటే 90 రోజుల పాటు 4జీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

ప్రస్తుతం ఈ ఆఫర్‌ కేవలం దిల్లీలో మాత్రమే లభ్యం కానుందని, త్వరలో అన్ని రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అజయ్‌ పూరి వెల్లడించారు. ఈ ఆఫర్‌తో ఎయిర్‌టెల్‌ వినియోగదారులు 24గంటలూ ఆన్‌లైన్‌లో ఉండేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. అంతేకాకుండా తరచూ రీఛార్జ్‌లు చేసుకునే బాధ తప్పుతుందన్నారు.

ఇటీవల విడుదలైన రిలయన్స్‌ జియో తన వినియోగదారులకు ఉచితంగా డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *