3 months 4G data for just Rs.1,494/-

Airtel has come up with new scheme to fight against the competition given by Jio. తాజాగా భారత్ ఎయిర్‌టెల్‌ 1,495 రూపాయలకే 3 నెలలపాటు అన్‌లిమిటెడ్‌ డేటాను అందించే 4జి ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను ప్రకటించింది. ఇందు లో 30 జిబి వరకు 4జి వేగం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుత వినియోగదారులు 1,495 రూపాయలకు ఈ ప్యాక్‌ ను పొందవచ్చు. కొ త్త వినియోగదారులు అయితే 1,494 రూపాయలు చెల్లించాల్సి ఉం టుంది. ఈ ప్యాక్‌తో ఎయిర్‌టెల్‌ కూడా ఒక జిబి డేటా ను 50 రూపాయలకే ఆఫర్‌ చేసినట్టవుతుంది. ఈ ప్యాక్‌ కింద 30 జిబిల వరకు 90 రోజులపాటు అధిక వేగంతో డేటాను పొందవచ్చని, డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటాయని, అప్పుడు 2జి వేగమే ఉంటుందని కంపెనీ ఆపరేషన్స్‌ (ఇండియా, దక్షిణాసియా) డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలిపారు.
4జి హ్యాండ్‌సెట్లు కలిగిన కస్టమర్లు అధిక డేటాను వినియోగించుకుంటారని, ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఈ ప్యాక్‌ను తెచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ డేటా ప్యాకేజ్‌ ఢిల్లీలో అందుబాటులో ఉందని, కొన్ని రోజుల్లోనే అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *