ఒక నెలలో కనీసం 5 కేజీలు తగ్గడం ఎలాగ? వ్యాయామం లేకుండా

సమతుల్యమైన ఆహరం తినటం, సమయానికి తగినంత నిద్ర పోవడం, నడక లాంటి వ్యాయామం దినచర్య గా అలవరచు కుంటే ఆరోగ్యం గానే కాదు నాజూకు గా కుడా ఉండవచ్చు.

కాని సమతుల్యమైన ఆహరం అంటే ఎలా?
తూకాలు పట్టుకొని కొలిచి తినాలా అని అడగచ్చు కాని
సమతుల్యమైన ఆహరం అంటే మన వందికి అవసరమైన ముఖ్య పోశాకాలని మనం అందిస్తే మన శరీర కర్మాగారం సక్రమం గా పని చేసి ఉండవలసిన రీతి లో ఉంటుంది.

ఈ క్రంది పద్దతిని పాటిస్తే వ్యయం చెయ్యకున్న సరైన దినచర్య పాటించే వారిలో కనీసం 5 KG ల బరువు త్రగ్గుటకు ఆస్కారం ఉన్నది. ఇందులో ముఖ్యం గా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ డైట్ ప్లాన్ డయాబెటిస్, థైరాయిడ్ వంటి గ్రంది (ఎన్దోక్రైన్) సంయస్యలు ఉన్నవారికి సరి పడకపోవచ్చు. వారు సరైన వైద్య పర్యవేక్షణ లో ఇలాంటి డైట్ ప్లాన్ ని అలవరచు కోవాలి
ఉదయం పూట తీసుకోవాల్సిన ఆహార నియమాలు

  • ఉదయం ||6 గం||—- నిమ్మరసం లో కొద్దిగా తేనే కలుపుకుని త్రాగాలి
  • ఉదయం||7 గం||—–ఒక కప్పు గ్రీన్ టీ (షుగర్ ఉన్న వారు పంచదార లేకుండా తాగండి-లేని వారు తేనె కలుపుకొని పంచదార దూరం పెట్టడం మంచిది)
  • ఉదయం||8 గం||—–పాలు లేదా కాఫీ లేదా టీ (కేవలం 1 స్పూన్ పంచదార- డయాబెటిస్ ఉంటె సుగేర్ వద్దు)
  • ఉదయం||9 గం||—–ప్రొద్దున టిఫిన్లో ౩ ఇడ్లీలు లేదా 2 బ్రెడ్ ముక్కలు లేదా ఉప్మా లేదా ఓట్స్ తిసుకొచ్చు
  • ఉదయం||11 గం||—-1 గ్లాస్ రాగి జావా (మజ్జిగ లేదా పాలతో – షుగర్ వ్యాది గ్రస్తులు ఉలవల ని ఉడకపెట్టి తీసిన సారాన్ని చిటికెడు ఉప్పు మిరియాల పొడి, కొంచెం అల్లం తురుము తో కాలిపి సూప్ లాగ తీసుకోవడం మంచిది)

 

మధ్యానం పూట తీసుకోవాల్సిన ఆహారనియమాలు

  • మధ్యానం|| 1 గం||—–2 పుల్కాలు,1 కప్పు అన్నం,1 కప్పు పప్పు,1 కప్పు (నూనే లేకుండా వండిన కూర),1 కప్పు పెరుగు.
  • మధ్యానం|| 3 గం||—–1 కప్పు గ్రీన్ టీ లేదా ఒక కప్పు పెరుగు లేదా ఫ్రూట్ జ్యూసు

సాయంత్రం వేళా తీసుకోవాల్సిన ఆహార నియమాలు

  • సాయంత్రం|| 5 గం||—- ఒక గ్లాసు మజ్జిగ లేదా 2 బిస్కట్స్ కాఫీ లేదా టీతో తిసుకొచ్చు
  • సాయంత్రం|| 8 గం||—౩ పుల్కాలు 1 కప్పు ఉడకపెట్టిన కూర లేదా పప్పు. లేదా ఉల్లిపాయ పెరుగు పచ్చడి.
  • పడుకునే ముందు పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని సాద్యమైనంత వరుకు పంచదార లేకుండా తాగితే చక్కని నిద్ర పట్టడమే కాక ఆరోగ్యానికి కూడా చాల ఉపయోగపడుతుంది.

రోజుకి కనీసం ౩ లీటర్ల నీళ్ళు తీసుకోవడం మరవద్దు

భోజనం సరిపోక ఆకలి వేస్తే పళ్ళు లేదా రోజుకి నలుగు మించకుండా జీడిపప్పు, బాదం పప్పు తింటే వంటికి అవసరమైన ముఖ్య పోషకాలు అందడమే కాక చర్మం కూడా యవ్వనం గా ఉంటుంది.

Comments

comments

You may also like...