Real Inspiration Sindhu…. Indians are Proud for her… P. V. Sindhu… We Love You

వచ్చింది వెండి పతకమే.. అయితే అది బంగారం కన్నా అమూల్యం! గెలిచింది ఒక్క పతకాన్నే.. అయితే వంద కోట్ల మంది హృదయాలను కూడా! నిలిచింది ద్వితీయ స్థానంలోనే.. అయితే అది అద్వితీయ అనుభూతుల ప్రస్థానం ఈ రజతం.. భారతరాగ రంజితం.. దేశమాత నుదుట దిద్దిన నవ సింధూరం క్రీడా చరిత్రలో కొత్త చరిత్రకు శ్రీకారం
యువతీ యువకులకు స్ఫూర్తి మంత్రం.

సింధు-కరోలినా మ్యాచ్‌ ఎంత హోరాహోరీగా సాగింది అని చెప్పేందుకు తొలిగేమ్‌లో సాగిన సుదీర్ఘ ర్యాలీనే ఉదాహరణ! ఒకదశలో ప్రత్యర్థికి భారీగా ఆధిక్యం కోల్పోయిన సింధు.. అద్భుతమైన నెట్‌గేమ్‌, డ్రాప్‌షాట్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ఓ ర్యాలీలో 49 షాట్లు నమోదయ్యాయి. దాదాపు 2 నిమిషాల సేపు షటిల్‌ గాల్లోనే అటూ.. ఇటూ గింగిరాలు కొట్టింది. ఆటను చూస్తున్నవారంతా ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూస్తుండగా ఆ పాయింట్‌ సింధుకు దక్కింది.

మన సింధు… బంగారం’ అనిపించింది. తానేమో వరల్డ్‌ నెంబర్‌ 10 ర్యాంకర్‌! అవతలున్నది బలమైన ప్రత్యర్థి… వరల్డ్‌ నెంబర్‌ 1 ర్యాంకర్‌ కరోలినా మారిన్‌! జరుగుతున్నది… గోల్డ్‌ కోసం పోరు! ‘సై అంటే సై’… బలమైన ప్రత్యర్థితో ‘ఢీ అంటే ఢీ’ అంటూ సింధు పోరాట స్ఫూర్తి ప్రదర్శించింది. మొదటి గేమ్‌ మొదలైనప్పటి నుంచీ ఉత్కంఠే! కరోలినా కూల్‌గా ఒక్కో పాయింట్‌ లాగేస్తోంటే… చిచ్చర పిడుగులా చెలరేగుతున్న సింధు ‘నిన్ను వదలను… నీవెంటే నేను’ అంటూ స్కోర్‌బోర్డును ముందుకు లాక్కెళ్లింది. ఫస్ట్‌గేమ్‌ ఫస్ట్‌ ఆఫ్‌ వరకు కరోలినాదే లీడ్‌! ఒక దశలో కరోలినా 11 వద్ద ఉండగా… సింధు స్కోరు ఆరే! ‘ఆట పోయినట్లేనా!!’… ఓ నిరాశ! అప్పుడే… సింధు మరోసారి గర్జించింది! సివంగిలా చెలరేగింది. లీడ్‌లో తేడాను బాగా తగ్గించింది. హోరాహోరీ పోరులో ఇద్దరి మధ్య ఒక ర్యాలీలో 49 షాట్లు నమోదయ్యాయి. సింధు 16… కరోలినా 19. మరో రెండు పాయింట్లు వస్తే గేమ్‌ కరోలినాదే! కానీ… సింధు ఆమెను అక్కడే ఆపింది. 16 నుంచి వరుసగా ఐదు పాయింట్లు కొట్టింది! ఎస్స్‌… అద్భుతం! అమోఘం! రియో ఒలింపిక్స్‌లో ఓటమి అన్నదే ఎరుగని స్పెయిన్‌ షట్లర్‌ కరోలినాకు సింధు ఆ రుచి చూపించింది. ఇంకో గేమ్‌ గెలిస్తే… గోల్డ్‌ గోల్‌ చేరుకున్నట్లే! రెండో గేమ్‌లో కరోలినా మరింత దూకుడుగా ఆడింది. లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడం ఆమెకు వ్యూహాత్మకంగా కలిసి వచ్చింది. ‘షటిల్‌’ను మూలమూలకూ తిప్పుతూ, చాన్స్‌ దొరికినప్పుడల్లా స్మాష్‌లు కొడుతూ పాయింట్లు కొల్లగొట్టింది. ఏదైతేనేం… రెండో గేమ్‌ సింధుకు కలిసి రాలేదు. ఒక దశలో సింధు రెండు వద్దేఆగిపోగా… కరోలినా 11వరకు చేరుకుంది.
అయినప్పటికీ సింధు కాన్ఫిడెన్స్‌ కోల్పోలేదు. పోరాట స్ఫూర్తి వదల్లేదు. సింధు పుంజుకున్నప్పటికీ… 12 పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లభించలేదు. గేమ్‌ కరోలినా వశమైంది. ఇక… మూడో గేమ్‌! కీలకం, నిర్ణయాత్మకం! ఆట మొదట్లో కరోలినాకే కలిసి వచ్చింది. చకచకమంటూ పాయింట్లు కొల్లగొట్టింది. సింధు 2 వద్ద ఉండగానే… కరోలినా 6 కొట్టేసింది. సింధూ… సింధూ… కమాన్‌ సింధూ… దేశవ్యాప్తంగా అభిమానుల ప్రార్థనలు! మొదటి గేమ్‌లాగే ఇదీ మలుపు తిరక్కపోతుందా అనే ఆశలు! ఈ ఆశలకు రెక్కలు తొడుగుతూ సింధూ పుంజుకుంది. అద్భుతమైన డ్రాప్‌షాట్లతో విరుచుకుపడింది. ఆధిక్యాన్ని 11-10కి తగ్గించింది. ఆ తర్వాత కొద్ది సేపు మాత్రమే పోటాపోటీగా స్కోరు బోర్డు పరుగు తీసింది. అయితే… వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ కరోలినా అసామాన్య పోరాట పటిమను ప్రదర్శించింది. సింధు స్కోరు 15 వద్ద ఉండగానే… గెలుపు కరోలినా వశమైంది! సింధుకు స్వర్ణం చేజారింది! ‘గోల్డ్‌’ పోతేనేం… 125 కోట్ల భారతీయుల హృదయాలను సింధు కొల్లగొట్టింది. ‘స్వర్ణం’ రాకపోతేనేం… స్వర్ణపతకం త్రుటిలో చేజారితేనేమి.. ‘మన సింధు బంగారం’ అంటూ అభిమానులు కొనియాడేలా ఆడింది. తన ప్రదర్శనతో ప్రపంచ నంబర్‌వన్‌ షట్లర్‌ను ఆద్యంతం ముచ్చెమటలు పట్టించింది.
sindhu

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *