APPSC Special History

జిల్లాలోని వీరాపురం వలస పక్షులకు ఆవాసంగా అలరారుతోంది. ముఖ్యంగా సైబీరియా నుంచే వచ్చే పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-7పై ఉన్న కొడికొండ చెక్‌పోస్టు నుంచి  13కి.మీ. దూరంలో వీరాపురం ఉంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వచ్చే పక్షులను ఈ వూరి ప్రజలు తమ అతిథులుగా చూసుకుంటారు. ఇక్కడకు వచ్చే పక్షిజాతుల్లో పెయింటెడ్‌ స్టార్క్‌ ముఖ్యమైంది. వీరాపురం వాసులు ముద్దుగా ఎర్ర కొంగ అంటారు. అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్‌ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతమైన విషయం

అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీరను తయారు చేసి బ్రిటీష్‌ పాలకులకు అందించిన ఘనత ధర్మవరం చేనేత కార్మికులది. శతాబ్ధకాలంగా ధర్మవరంలో పట్టుచీరల తయారీ జరుగుతోంది. ఇక్కడ తయారు అయ్యే పట్టుచీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. పది మగ్గాలతో ప్రారంభమైన పట్టు పరిశ్రమ నేడు 40వేల మగ్గాలకు చేరింది. వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమంది ఉపాధి పొందుతున్నారు. 1910లో మొదటిసారిగా ధర్మవరంలో పట్టు చీరలు నేయడం ప్రారంభించారు. దక్షిణ భారతంలో కంచి తరువాత ధర్మవరం పేరు గాంచింది. కంచిపట్టుచీరలకు ధీటుగా ధర్మవరం చేనేత మగ్గాలపై పట్టుచీరలను తయారు చేస్తుండటంతో తమిళనాడువాసులు ధర్మవరం పట్టుచీరల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఏటా వెయ్యికోట్ల రూపాయల విలువైన పట్టుచీరలు ఎగుమతులు ధర్మవరం నుంచి జరుగుతున్నాయి.

birds        sarees

Comments

comments

You may also like...