APPSC Special History Temples

రాష్ట్ర పురావస్తు రక్షిత కట్టడాల కింద జిల్లా 44 ఆలయాలున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 23 ఉన్నాయి. జిల్లా చిన్న, పెద్ద దేవాలయాలు 1000 దాకా ఉన్నాయి.

వసంత వల్లభుడు.. శ్రీఖాద్రి నృసింహుడు
800 ఏళ్లనాటి దివ్యక్షేత్రం

దిరిలో కొలువుదీరిన నారసింహుడు నిత్యపూజలతో బ్రహ్మాండనాయకుడిగావెలుగొందుతున్నారు. ఆ పవిత్ర ఖాద్రి దివ్యక్షేత్రం పడమటి వైపు నదీతీరం ఉంది. అక్కడ భృగుమహర్షి తపస్సు చేసి.. శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారు. మహర్షి కోరిక మేరకు స్వామి స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలు అందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వసంత రుతువులో శ్రీవారు అనుగ్రహించడంతో ఉత్సవ మూర్తులకు వసంత వల్లభులని పేరొచ్చింది. భృగుమహర్షి తపస్సు ఫలితంగా ఖాద్రి క్షేత్రంలో స్వయంభువుగా వెలిశారు. వసంత వల్లభుడైన శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఏటా 15 రోజుల పాటు వివిధ అవతారాల్లో కనువిందు చేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. వాటినే బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు.
క్షేత్రం ప్రత్యేకత
లోకకంఠకుడైన హిరణ్యకశ్యపుడనే దానవుడి సంహారానికి శ్రీవారు మహోగ్రరూపంతో స్తంభం నుంచి ఆవిర్భవించారు. సగం మనిషి, సగం సింహం రూపం దాల్చిన స్వామివారు భక్తప్రహ్లాద స్తోత్రంతో శాంతించి ఖాద్రిక్షేత్రంలో కొలువుదీరారు. స్వామి పాదం కొండపై మోపడంతో ఖాద్రి అని పిలుస్తున్నారు. కాలక్రమేణా ఈ ప్రాంతం కదిరిగా స్థిరపడింది. ప్రశాంతవదనంతో కొలువుదీరిన స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన దివ్యక్షేత్రం ప్రత్యేకతలను సంతరించుకుంది. అభిషేకానంతరం శ్రీవారి మూలవిరాట్టు నుంచి స్వేద బిందువులు వస్తుండటం మహిమాన్వితంగా భక్తులు భావిస్తుంటారు. ఎక్కడా లేని విధంగా ప్రహ్లాదునితో పాటు శ్రీలక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ సందర్శనకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో వస్తుంటారు.
ఇదీ ఆలయ చరిత్ర
కదిరి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతరేపల్లెను పాలించిన పట్నం రంగనాయకుడికి శ్రీలక్ష్మినరసింహస్వామి కలలో కనిపించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి ఆలయం నిర్మించాలని కోరినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో రంగనాయకుడు వెలికి తీయించి ప్రతిష్ఠించడంతో పాటు గర్భాలయం నిర్మించారు. తరువాత క్రీ.శ. 1274లో శ్రీవీరబుక్కరాయల హయాంలో పూర్తిస్థాయిలో ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
దేశంలో మూడోది
వచ్చేనెల 14న శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనారసింహ స్వామి భారీ రథంపై కొలువుదీరి తిరువీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగులు ఎత్తు కలిగిన రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 120 ఏళ్లక్రితం తయారుచేసిన ఈ రథం చక్రాలు ఒక అడుగు ఒక అంగుళం వెడల్పుతో 8 అడుగుల డయా మీటరుతోఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్పకలాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథం తర్వాత మూడవ అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందింది.
vallabaray temple      narasimha

Comments

comments

You may also like...