లేపాక్షి ఆలయం యొక్క చరిత్ర

లేపాక్షి ఆలయం

రావణుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకెళ్తుండగా, జఠాయువు పక్షి అడ్డగించింది. కోపోద్రుక్తుడైన రావణుడు దాని రెక్కలు నరికివేస్తాడు. సీతాన్వేషియై తిరుగుతున్న రాముడు ఈ ప్రాంతానికి రాగా రెక్కలు తెగి ఉన్న జఠావును చూసి లే.. పక్షి అన్నాడని దాంతో ఈ ప్రాంతం లేపాక్షిగా మారిందని ఇతిహాస గాథ.

 

ప్రపంచ ప్రసిద్ధి చెందిన నంది
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది మరెక్కడా లేదు. 15అడుగుల ఎత్తు, 27అడుగుల పొడవుతో జీవకళ ఉట్టిపడుతూ పైకి లేచివస్తున్నట్లు కనబడే ఈ నంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

మూడు గుడుల ముచ్చట
లేపాక్షిలో ప్రధాన దేవుడు వీరభద్రుడు. అక్కడే మరో రెండు చిన్న దేవాలయాలున్నాయి. పాప వినాశనేశ్వరస్వామి ఆలయం, రఘునాథాలయం, శివకేశవులకు తేడా లేదని ఒకే చోట శైవ, విష్ణు ఆలయాలు ఎదురెదురుగా ఉండటం లేపాక్షిలోని మరో ప్రత్యేకం.ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది ముఖ మండపం(నాట్యమండపం) అర్ధమండపం (గర్భగృహం), కల్యాణమంటపం, మంటపాలన్నీ సుందర శిల్ప శోభితంగా అలరిస్తాయి.

 

గర్భగుడిలో
గర్భగుడిలో వీరభద్రస్వామి, దుర్గాదేవి, శివకేశవులు ప్రధాన దేవుళ్లు. పైకప్పు అంతా చిత్ర కళాసమన్వితంగా ఉంటుంది. 34అడుగుల వీరభద్రుని పెయింటింగ్‌ చిత్రం ఆసియాలోకెల్లా పెద్దది. ఒక వాస్తుపురుషుడు, పద్మినీజాతి స్త్రీ, శిల్పాలను ప్రభుత్వ చిహ్నాలుగా ఎంపిక చేశారు.

అబ్బురపరిచే వేలాడే స్తంభం
ఆలయంలో ఉన్న వేలాడే స్తంభం నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనం. గర్భగుడికి ముందు ఉన్న ఈ స్తంభం వేలాడుతూ ఉంటుంది. భూమిని ఏమాత్రం తాకకుండా గాలిలో ఉంటుంది. దీనిని పక్కకు జరిపించాలని నాటి బ్రిటీషు కాలంలో ఓ ఇంజినీర్‌ ప్రయత్నించగా గుడిలోని శిలలన్నీ కదిలినట్లు కథ ప్రచారంలో ఉంది.

తనే శిక్ష విధించుకున్న విరూపణ్ణ
1538లో విజయనగర రాజుల ప్రధాన కేంద్రమైన పెనుకొండ. దాని కోశాధికారిగా ఉన్న విరూపణ్ణకు దేవాలయాన్ని నిర్వహించేందుకు నిధులు వెచ్చించాడు. విరూపణ్ణపై కొందరు రాజుకు లేనిపోనివి చెప్పడంతో రెండు కన్నులు పీకేయాలని శిక్ష విధించారు. ఇది తెలుసుకున్న విరూపణ్ణ తన కళ్లు తాను పీకి గోడకు కొట్టినట్లు చరిత్ర చెబుతోంది. నేటికీ ఆ రక్తపు మరకలు ఉండటం విశేషం.

నాట్య మండపం
70 స్తంభాలతో నిర్మించిన నాట్య మండపంలో ప్రతి స్తంభంలోను శిల్పుల నేర్పరితనం కనిపిస్తోంది. మంటపం మధ్య ఉన్న 12 స్తంభాల మీద నాట్యకత్తెల భంగిమలతో పాటు సంగీత వాయిద్యకారుల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మూడు కదళ్లతో గుర్రపు దంతాలు, కమ్మీలతో, తలలో జడగల భృంగీశ్వరుని నాట్యాచార్యునిగా చూపారు. ఇదే స్తంభంలో మరో వైపు భిక్షాటన చేస్తున్న శివుడ్ని మలిచారు.

ఉట్టిపడే లేపాక్షి ఆకృతులు
కళ్యాణమంటపానికి ఒక ఆనుకొని ఉత్తర దిశలో పలు స్తంభాల్లో అద్భుత ఆకృతులు శిల్పులు ఆనాడే చెక్కారు. వాటినే నేడు లేపాక్షి డిజైన్స్‌గా పిలుస్తున్నాం. చీరలకు వీటిని ఉపయోగిస్తున్నారు.

అద్భుతం… ఆ చిత్ర రాజాలు
ఆకుల రసాలతో నాట్య మంటపంలోని పైకప్పుపై చిత్రలేఖనం నేటికీ ఎంతో చక్కగా కనపడటం విశేషం. భూకైలాస్‌, మానునీతిచోళుని కథ, భక్తిశిరియాళుని కథ, కిరితార్జునీయం, భక్తమార్కండేయ ఇలా ఎన్నో భక్తి కథలను చిత్రాల రూపంలో దర్శనమిస్తాయి.

ఆకట్టుకొంటున్న సీతాదేవి పాదం
ఆలయం వెలుపల సీతాదేవి పాదం. అప్పట్లో శిల్పులు వాడిని తట్టలు చూస్తేనే ఎంత భారీ మనుషులో తెలుసుకోవవచ్చు.
బస్సు సౌకర్యం
హిందూపురం నుంచి లేపాక్షి 15కి.మీ. ప్రతి పది నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అనంతపురం, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే వారు కొడికొండ చెక్‌పోస్టు మీదుగా చేరుకోవచ్చు.

lepakshi 1      foot print    snake

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *