భారత సైన్యానికి సలాం చేసిన ధోని

టీమ్‌ఇండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి భారత సైన్యానికి సంబంధించిన అంశాలపై ఆసక్తి, అవగాహన రెండూ ఎక్కువే. సైన్యం నుంచి గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా అందుక్ను అతడు.. ఆ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలనూ ఎప్పుడూ జాగ్రత్తగా గమనిస్తుంటాడు. శుక్రవారం భారత వాయసేనలో ‘తేజస్‌’ యుద్ధ విమానాలు కొత్తగా చేరిన సందర్భంగా ధోని అభినందనలు చెప్పాడు. ‘‘కొత్త యుద్ధ పక్షులను తెచ్చుకున్న భారత వాయుసేనకు శుభాకాంక్షలు. ఈ ప్రాజెక్టుతో సంబంధమున్నవారితోపాటు దేశమంతటికీ ఇది గర్వ కారణం’’ అని ధోని చెప్పాడు. తేజస్‌ విమానాలు దేశీయంగానే తయారయ్యాయి. వివిధ అస్త్రాలను మోసుకెళ్లేందుకు ఈ తేలికపాటి యుద్ధ విమానాలను ఉపయోగిస్తారు.

dhone

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *