అనంతపురం ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు

వేమన ఆలయం

ప్రజాకవి వేమన ఆలయం గాండ్లపెంట మండలం కటారుపల్లెలో ఉంది. ఆలయం 16వ శతాబ్దం నాటిది. యోగి వేమన సమాధి ఇక్కడే ఉంది. అనంతపురానికి 130 కి.మీ. దూరంలో కదిరికి సమీపంలో ఉంది.యోగి వేమన సాంఘిక దురాచాలపై కత్తిగట్టి తన కవిత్వంతో సమాజంలో చైతన్యం రగిలించి ప్రజాకవిగా మారాడు. ఆనాటి కుల పెత్తనం, అస్పృశ్యతని ఆయన నిరసించాడు. విషప్రయోగం కారణంగా అపస్మారక స్థితికి చేరిన వేమనను అభిరాముడనే కంసాలి రక్షించాడు. అభిరాముడు అంబికా శివయోగి అనే యోగి పుంగవుని సేవించే వాడు. ఆ యోగి ఉపదేశం పొందిన వేమన సంసార జీవితంపై విరక్తి చెంది సమాజాన్ని సంస్కరించడానికి తన వంతు ప్రయత్నం చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. యోగిగా మారిన వేమన అభ్యుదయ కవిత్వాన్ని బోధిస్తూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో సమాధి అయ్యారని చరిత్రకారుల అభిప్రాయం. ఆయన పామరులకు సైతం అర్థమయ్యేలా పద్యాలు చెప్పారు.
* 2004లో టూరిజం శాఖ రూ.2.5 కోట్లతో వేమన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. వేమన సమాధి ఘాట్‌, ఉద్యాన వనం, రెస్టారెంట్‌, యాత్రికులకు విశ్రాంతి గదులు నిర్మించారు.

నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం

సాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆంధ్రదేశంలోని ముఖ్య యాత్రా

స్థలాల్లో కసాపురం ఒకటి. ఇది గుంతకల్లుకు సమీపంలో ఉంది. క్రీ.శ. 15 శతాబ్దంలో వ్యాసరాయలచే ప్రతిష్ఠించిన ఆంజనేయవిగ్రహం ఇక్కడ ఉంది. ఏటా రథోత్సవం వైభవంగా జరుగుతుంది. జిల్లా కేంద్రానికి 85 కి.మీ. దూరంలో ఉంది

nettakanti kasapuram         Vemana Temple

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *