Who wrote Lalitha Sahasranamas (లలితా సహస్రనామాలను ఎవరు రచించారు)?

లలితా సహస్రనామ స్తోత్రము, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.

ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన లలితా దేవి ఆరాధన కి ఆ తల్లి అనుగ్రహానికి ఈ లలితా సహస్రానామాలే భక్తుల పాలిటి వరం.

lalitha-sahasranamavali

ఈ వరం సాక్షాత్తు విష్ణుమూర్తి అవ‌తారమైన హ‌య‌గ్రీవుడు అమ్మ‌వారి వేయి నామాల‌ను అగ‌స్త్య‌మ‌హ‌ర్షికి బోధించారు. స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును పాలించే అమ్మ‌వారి స‌హ‌స్ర నామాల‌ను ప‌ఠిస్తే  స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. సాక్షాత్తు త‌ల్లి పార్వ‌తీదేవి మ‌న‌కు ఇచ్చిన గొప్ప‌వ‌రం ఈ నామావ‌ళి. అమ్మ‌వారి య‌శ‌స్సును కీర్తిని, శ‌క్తిని తెలిపే నామాల‌ను ప‌ఠిస్తే అనేక మంచి ఫలితాలు క‌లుగుతాయి. ప్ర‌తి మ‌నిషి జీవితంలో అనేక మైన జాత‌క దోషాలుంటాయి. వీటి నివార‌ణ‌కు మ‌నం ఎన్నో శాంతి ప్ర‌క్రియ‌లు చేస్తుంటాం. అయితే అమ్మ‌వారి ల‌లితా నామాల‌ను చ‌దివితే ఈ జాత‌కదోషాలు మ‌న‌ల‌ను బాధించ‌వు. బ్ర‌హ్మాండ‌పురాణంలో ల‌లితా దేవి స‌హస్త్ర నామావ‌ళి వుంది. ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన శ్రీ‌పురం అమ్మ‌వారి నివాస‌స్థ‌లాన్ని సూచించే  శ్రీ‌చ‌క్ర ప్ర‌స్తావ‌న పురాణాల్లో వుంది. అమ్మ‌వారి స్థానం క‌నుక శ్రీ‌చ‌క్రానికి అంత విశిష్ట‌త ల‌భించింది. భండాసురున్ని సంహ‌రించేందుకు జగ‌న్మాత ల‌లితా దేవిగా జ‌న్మించిన‌ట్టు పురాణాలు వెల్ల‌డిస్తున్నాయి. నియ‌మ‌బ‌ద్ధంగా, శుచిగా అమ్మ‌వారి నామాల‌ను ప‌ఠిస్తే అనంత‌మైన ఆనందం క‌లుగుతుంది. ఈ మంత్రాల‌ను వాశిన్య‌ది దేవ‌త‌లు అమ్మ ఆన‌తి ప్ర‌కారం మొద‌ట ప‌ఠించారు. అనంత‌రం హ‌య‌గ్రీవులు అగ‌స్త్య‌మహ‌ర్షికి ఉప‌దేశం చేశారు. ఆదిశంక‌రాచార్యులు, భాస్క‌రాచార్యులు స‌హస్త్ర‌నామాల‌పై వ్యాఖ్యానాలు ర‌చించారు. స‌మ‌స్త జ‌గ‌త్తును న‌డిపించే ఆ త‌ల్లి నామావాళిని ఏకాగ్ర‌త‌తో చ‌దివితే మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *