Ways to reduce Diabetes

అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా ఆపవచ్చు.

ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహరం
మధుమేహ వ్యాధితో భాదపడే వారు ఫైబర్ ఎక్కువ ఉన్నఆహారాలు తీసుకోమని మరియు తీసుకునే ఆహరంలో తక్కువ కార్బోహైడ్రేట్’లు, కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోమని నిపుణులు మరియు వైద్యులు సలహా ఇస్తున్నారు. తీసుకునే ఆహరంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉండటం వలన శక్తి స్థాయిలు నిర్వహణ, శరీరంలో జరిగే జీవక్రియ రేటు కుడా సాధారణ స్థాయిలో ఉండేలా చేస్తాయి.

పోగత్రాగటానికి దూరంగా ఉండండి
పొగత్రాగటం వలన గుండె సంబంధిత వ్యాధులు మాత్రమె కాకుండా మధుమేహ వ్యాధిని ప్రభావిత పరిచే హార్మోన్’ల విడుదలలో మార్పులను కలుగచేస్తుంది. పొగత్రాగటం వలన మీ మధుమేహ వ్యాధి తీవ్రస్థాయిలకు చేరటమే కాకుండా పూర్తి ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురి చేస్తుంది.

ఎక్కువ నీరు త్రాగటం వలన
నీరు అనేది శరీరానికి అవసరమైన వాటిలో ముఖ్యమైంది మాత్రమే కాకుండా, శరీర రక్తంలోని చక్కెరలను మరియు కొవ్వు పదార్థాల స్థాయిలను పెరగకుండా సహాయపడుతుంది. రోజు నీటిని ఎక్కువగా త్రాగటం వలన రోజులో జరిపే కార్యకలపాలను ఉత్తేజంగా నిర్వహించటమే కాకుండా గుండె సంబందిత వ్యాధులు మరియు మధుమేహ వ్యాధి వలన కలిగే సంక్లిష్ట సమస్యలను తగ్గిస్తుంది

హాయిగా పడుకోండి
యుక్త వసయులో ఉన్న వారు రోజులో 7 నుండి 8 గంటలు పడుకునే వారితో పోలిస్తే, పడుకొని వారు ఎక్కువగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు అని వివిధ రకాల పరిశోధనలలో వెల్లడించబడింది. అవసరమైనంత మేరలో పడుకోకపోవటం వలన శరీరంలో హార్మోన్’ల విడుదలలో అసమతుల్యతలు మరియు మధుమేహవ్యాధి విషమ పరిస్థితికి చేరుకునే అవకాశం ఉంది.

వ్యాయమాలు
ఆరోగ్యవంతమైన జీవన శైలి, వివిధ రకాల భౌతిక కార్యకలపాలను చేయటం వలన మధుమేహ వ్యాధిని నివారించవచ్చు లేదా మధుమేహ వ్యాధి కలుగటాన్ని ఆలస్యం చేయవచ్చు. మధుమేహ వ్యాధిని మాత్రమె కాకుండా ఇతరేతర చాలా రకాల వ్యాధులను శక్తి వంతంగా, సులువుగా తగ్గిస్తుంది అంబి చెప్పవచ్చు. సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి సులువైన వాటిని అనుసరించవచ్చు.

ఫైబర్
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో రక్తంలోని చక్కెర స్థాయిలు మరియు ఇన్సులిన్ విడుదలను సాధారణ స్థాయిలో ఉండేలా చూస్తాయి. హోట్ మల్ వీల్టీ గ్రైన్స్, మరియు ఫైబర్’లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధిని సులభంగా నిర్వహించవచ్చు.

మధ్యపానం
ఆల్కహాల్’ను తాగటం వలన శరీర రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, మరియు ఆల్కహాల్ ఎక్కువ క్యాలోరీలను కలిగి ఉంటాయి. మీరు మధుమేహ వ్యాధి కలిగి ఉండి, ఆహర నియమాలను పాటిస్తున్నట్లయితే మరియు మీ శరీరంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకరమైన స్థాయిలో నిర్వహించబడినట్లయితే అపుడపుడు మాత్రమె ఆల్కహాల్’లను కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు.

స్థాయిల తనికీ
మధుమేహ వ్యాధిని తగ్గించటానికి ఉన్న మంచి మార్గం రోజు రక్తంలోని చక్కర స్థాయిలను చెక్ చేపించుకోవటం. 45 సంవత్సరాల వయసు గల వారు మరియు అంతకన్నా తక్కువ వయసు గల వారు ప్రతి మూడు సంవత్సరాలకి ఒక సారి చెక్ చేపించుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా, అధిక రక్త పీడనం లేదా స్థూలకాయత్వం గల వారు తరచుగా చక్కర స్థాయిలను చెక్ చేపించుకుంటూ, వైద్యుడిని సంప్రదించటం చాలా మంచిది

Weight loss breakfast concept with fruits

Weight loss breakfast concept with fruits

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *