Slight Changes in AP Police Recruitment Posts.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగాలకు సంబంధించి భర్తీ చేయనున్న పోస్టుల్లో స్వల్పమార్పులు చోటుచేసుకోనున్నాయి. మొత్తం పోస్టుల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల లేకపోయినప్పటికీ వివిధ విభాగాల వారీగా ప్రకటించిన పోస్టుల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ నెల 17న జారీ చేసిన ఉత్తర్వులకు ఈ మేరకు సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ గురువారం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న ఏపీ డీజీపీ జేవీ రాముడు నుంచి ఆర్థిక శాఖకు అందిన లేఖ మేరకు ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం సివిల్‌ ఎస్సై పోస్టుల సంఖ్య స్వల్పంగా తగ్గగా, కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులసంఖ్య తగ్గగా, ఏఆర్‌ కానిస్టేబుళ్ల సంఖ్యను పెంచారు. గుంటూరు గ్రామీణ, గుంటూరు అర్బన్‌ పోలీసు జిల్లాలకు కేటాయించిన పోస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా పోస్టులన్నీ తొలుత ప్రకటించిన విధంగానే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పులు లేవు.

ap police logo

Comments

comments

You may also like...